అదిలాబాద్

ఖైదీలు మానసికంగా పరివర్తన చెందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్: ఖైదీలు మానిసకంగా పరివర్తన చెందాల్సిన అవసరం ఉందని వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డిఐజి కేషవ నాయుడు అభిప్రాయ పడ్డారు. గురువారం ఆయన ఆసిఫాబాద్ ప్రత్యేక సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులను, వంట గదులను తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలుకు వస్తున్న రిమాండ్ ఖైదీల్లో మానసిక పరివర్తనకు బాటలు వేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారిలో మానసిక పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రత్యేక శిక్షణ తరగుతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జైలు జీవితం పూరె్తైన తరువాత తమ శాఖ అధ్వర్యంలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిఐజి పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌లో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ పంపును పరిశీలించినట్లు ఆయన తెలిపారు. కాగా, మొదట డిఐజి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.