డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు తేజాలాంటి కూతురు దొరికినందుకు సంతోషంగా ఉంది. వౌళికి, మీ అందరిలాంటి స్నేహితులు, దేశానికి దూరంగా ఇంత పెద్ద కుటుంబం దొరకడం చాలా సంతోషం’’ అన్నాను.
వౌళి, తేజా ఒకసారి లేచి మైక్ ముందు నిలబడ్డారు. ఒక నిమిషం నువ్వు ముందంటే నువ్వు ముందు అని ఆలోచించుకున్నారు.
చివరకు వౌళి, ‘‘మూర్తిగారి కుటుంబం చూపిన ఆతిథ్యానికి, స్నేహితులు కురిపించిన ఆశీస్సులకు థాంక్స్ చెప్పాడు. నా లైఫ్‌లో నా థాట్ ప్రోసెస్స్ అంతా మా అమ్మది. నౌ మై వాయిస్ ఈజ్ మై వైఫ్స్! తేజ అంత స్వీట్‌గా మాట్లాడటం నాకు రాదు. షి విల్ కంటిన్యూ అంటూ మైక్ తేజాకి ఇచ్చాడు.
తేజ నిజంగానే చాలా స్వీట్‌గా క్లియర్‌గా టు ది పాయింట్ చక్కగా మాట్లాడింది.
కొత్త దంపతులకు టోస్ట్ చెప్పారు. మళ్లీ పెద్ద డిన్నర్ జరిగింది. మధ్యాహ్నం తిన్న పెళ్లి భోజనానికి పూర్తిగా విరుద్ధంగా ఇండియన్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్ అన్ని రకాలు సర్వ్ చేశారు.
కుర్రకారంతా డాన్సు ఫ్లోర్‌మీదకు వచ్చేశారు.
హిందీ, ఇంగ్లీష్ పాటలకు అనుగుణంగా డాన్సులు చేశారు. చాలామంది భార్యాభర్తలు చేశారు.
బొత్తిగా ఇష్టం లేనివాళ్ళు మాత్రం టేబుల్స్ చుట్టూ కూచున్నారు కబుర్లు చెప్పుకుంటూ!
మూర్తిగారు, సావిత్రి వాళ్ళతో పాటు నన్ను కూడా ప్రతి టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లి అందరికీ థాంక్స్ చెప్తూ నన్ను కూడా పరిచయం చేశారు.
చిట్టచివరగా ఒక టేబుల్ దగ్గరకు వెళ్ళేటప్పటికి, ఆ టేబుల్‌మీద ఒక అపరిచితమయిన జంట కనిపించారు. ఈ వారం రోజుల్లో మిగిలిన ఏ సందర్భంలోనూ చూసినట్లు గుర్తులేదు. ఆరోజు పొద్దున్న కూడా! అయినా అన్ని వందలమంది పెళ్లిలో అందరి మొహాలు ఎలా గుర్తు ఉంటాయి అనుకున్నాను.
కాని, అతను ఈ ఊరువాడు కాదుట. ఎవరో స్నేహితుల ఇంటికి వచ్చాడు. వాళ్ళు అతన్ని ఈ పెళ్లికి తీసుకువచ్చారు. మూర్తిగారితో పరిచయం లేదు.
కానీ అతను నా ముఖం వంక చాలా తేరిపార చూచాడు. నాకు కూడా అతని మొహం కొంచెం పరిచయంగా అనిపించింది కాని ఏ మాత్రం గుర్తుపట్టలేకపోయాను.
యాంత్రికంగా నమస్కారం పెట్టి అక్కడినుండి వెళ్లిపోయాను.
చాలామంది డిజర్ట్ తెచ్చుకోవడానికి లేచారు. మరికొంతమంది డాన్సు ఫ్లోర్‌మీద ఉన్నారు. సావిత్రి మూర్తిగారు వచ్చిన అతిథులను పలకరించడంలో మునిగిపోయారు.
నేను, భాస్కర్, చంద్రశేఖర్ కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం.
‘‘రా అత్తయ్యా! మనం కూడా డిజర్ట్ తెచ్చుకుందాం’’ అంటూ దారితీశాడు చంద్రశేఖర్!
‘‘పెళ్లి రిసెప్షన్ చాలా బాగా చేశారు కదా!’’ అన్నాడు భాస్కర్.
‘‘నువ్వే చెప్పాలి ఇక్కడ ఉంటున్నవాడివి. నాకు ఇక్కడి పద్ధతులు తెలియవు కదా!’’’ అన్నాను.
‘‘చాలా బాగా జరిగింది అత్తయ్యా, ఇంత ఆర్గనైజ్డ్‌గా నేనిదివరకు ఎక్కడా చూడలేదు’’ అన్నాడు శేఖర్.
భాస్కర్, శేఖర్ కబుర్లలో పడిపోయారు. నేను ఒంటరిగా ఒక కాఫీ తెచ్చుకుని, పెద్ద విండో దగ్గర నుంచున్నాను. పక్కన రివర్ ప్రశాంతంగా సాగిపోతోంది. లైట్ల కాంతుల ముందు వెనె్నల వెలుగులు వెలవెలపోతున్నాయి. ఎప్పుడూలాగానే ఆలోచనలు అటూ ఇటూ పరిగెడుతున్నాయి. ఆ రోజు జరిగిపోయినవన్నీ కళ్లముందు తిరుగుతున్నాయి. మనసు సంతృప్తిగా ఉంది. కానీ మళ్లీ ఏదో ముల్లులా తగులుతోంది. జీవితంలో కొన్ని బంధాలు తుడుచుకుపోవేమో!
‘‘నమస్తే!’’ వెనుకనుంచి వినపడింది. చటుక్కున వెనక్కి తిరిగాను.
ఇందాక చివరగా పలకరించిన వ్యక్తి! ‘‘నా పేరు రామకృష్ణ’’ అన్నాడు.
నమస్కారం చేశాను.
‘‘మీరు చాలా ఏళ్ళక్రితం చూసి ఉంటారు!’’ అన్నాడు.
‘‘సారీ నాకు మీరెవరో గుర్తుకురావడంలేదు’ అన్నాను క్షణకాలం ఆలోచించి.
‘‘నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టేవాడినికాదు, ఎంసి అనౌన్స్ చెయ్యకపోతే!’’ అన్నాడు.
అర్థంకానట్లు చూశాను.
‘‘నేను రఘురాం తమ్ముడిని’’ అన్నాడు మెల్లగా!
మైగాడ్! అనుకున్నాను. నాకు పెళ్లి అయ్యేటప్పటికి అతను చాలా చిన్నవాడు. హైస్కూల్‌లో ఉన్నాడేమో!
నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు! ఒక్క క్షణం వెర్రిగా చూశాను అంతలోనే సర్దుకున్నాను. అతనివంక చూచి చిరునవ్వు నవ్వాను. అంతకంటే మాకు మాట్లాడాల్సినవి లేవు. త్వరగా అక్కడినుండి వెళ్లిపోతే బాగుండును అనుకున్నాను.
‘‘నేను కాలిఫోర్నియాలో ఉంటాను. ఆఫీసు పనిమీద ఇటు వచ్చాక- మా స్నేహితుడిని కలుద్దామనుకుంటే వాడు ఇక్కడకు రమ్మనమని బలవంతం చేశాడు’’ అన్నాను.
తల ఊగించి చిరునవ్వు నవ్వాను!
‘‘రఘుకు తెలుసా మీరు వచ్చినట్లు?’’
రెండు నిమిషాలు మాట్లాడలేదు. తరువాత అన్నాను. ‘‘వి హావ్ నో కాంటాక్ట్స్’’.
‘‘.......’’
మీకు ఉందా! అడిగాను.
‘‘అప్పుడప్పుడు!’’ అన్నాడు.
తల ఊగించి చేతులు జోడించి ‘‘నైస్ మీటింగ్ యు’’ అని ఇవతలకు వచ్చాను.
‘‘వాజ్ ఇట్?’’ అనుకున్నాను. నా ఈ అమెరికా యాత్రలో అనుకోనివి చాలా జరిగాయి.
ఊహించని వాళ్లను కలిశాను. ఊహించనంత గొప్పగా శుభకార్యాలను చూశాను. అపరిచితుల ఆప్యాయత రుచి చూచాను. కొత్త బంధాలు కలుపుకున్నాను. కానీ చిత్రం వౌళి పెళ్లికి వాడి సొంత పినతండ్రివచ్చాడు. ఎటువంటి పిలుపులు లేకుండా యాదృశ్చికం అంటే ఇదే కాబోలు. వౌళికి తెలిస్తే ఏమంటాడో.
మొత్తానికి రిసెప్షన్ పూర్తి అయింది. చాలా ఆలస్యం అయింది. అందరూ వెళ్ళేటప్పటికి అక్కడ ముగింపు పనులన్నీ చూసుకుని అందరితో మాట్లాడి పూర్తి అయ్యేటప్పటికి మరో అరగంట పట్టింది.
అందరం కలిసి హోటల్‌కు వచ్చేశాం. మూర్తిగారు, సావిత్రి దిగబోయారు. బాగా ఆలస్యం అయింది. మీరు వెళ్లండి, మేం వెడతాం’’ అన్నాను.
‘‘కాదులెండి’’ అంటూ సావిత్రి దిగి వచ్చింది తేజా సూట్‌కేసు పట్టుకుని.
ఎలివేటర్స్ దగ్గరకు రాగానే తేజా సూట్‌కేసును వౌళి అందుకున్నాడు.
గుడ్‌నైట్ అని వాళ్లు హనీమూన్ స్వీట్‌లోకి వెళ్లారు. మేం ముగ్గురం మా గదికి వచ్చాం. సావిత్రి ఒక్కసారి కుర్చీలలో కూర్చుని హాయిగా ‘అమ్మయ్య’ అనుకుంది. అందరి మనసులోనూ అదే అనిపించింది.
ఏదయినా పనిచేసేముందు కలిగే ఆదుర్దా పని పూర్తి అయ్యాక అందులో అనుకున్నట్లు అందంగా పూర్తయితే అది ఆనందంగా మారుతుంది. హాయిని కలిగిస్తుంది.
‘‘అన్నీ చాలా బాగా జరిగాయి. మీరు చాలా శ్రమపడ్డారు’’ అన్నాను ఇద్దరినీ ఉద్దేశించి.
‘‘శ్రమ లేదండి. ఇట్స్ ఎ ప్లెజర్’’ అన్నది సావిత్రి. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగాయి. ఆ ఎంసి అనౌన్స్‌మెంట్‌లో ఆ ఒక్క పొరపాటు జరగకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్నారు మూర్తిగారు, నా ఎదుటగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
‘‘ఇంక మర్చిపోండి.. అయిపోయిందిగా!’’ అన్నాను ఇంకేమనాలో తెలియక.
కానీ, అది ఆయనకు తృప్తిగా లేదు. అల్లుడికి మొట్టమొదటగా ఇబ్బంది కలుగజేశాడని తల అడ్డంగా ఊగించాడు.
‘‘వౌళికి ఇష్టం లేదని తెలిసి జాగ్రత్తపడలేకపోయాం కదా! అసలు నేను ఊహించలేదు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి