స్టంపర్ అదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ సినిమాకు సంబంధించిన స్టంపర్ లేటెస్టుగా విడుదలై సంచలనం రేపుతోంది. ఇదివరకు మనం టీజర్, ట్రైలర్, మోషన్ పోస్టర్‌లను చూశాం. మొదటిసారిగా స్టంపర్ అంటూ కొత్త టెక్నాలజీతో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఆయన లుక్‌పట్ల నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. కూల్ లుక్‌లో బాలయ్య అదిరిపోయాడని, ముఖ్యం గా ఈ స్టంపర్ విడుదలై తన రికార్డును తానే అధిగమించాడు. ఒక్కరోజులో దాదాపు 2.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. గతంలో బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు అత్యధిక వ్యూస్ దక్కాయి. దాన్ని పైసా వసూల్ అధిగమించింది. మరోవైపు బిజినెస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రంలో శ్రీయ, ఖైరాదత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.