డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఎంసికి తెలుస్తుందని. అతను అలా అనౌన్స్ చేస్తాడని. అసలు ఈ విషయం మా వెరీ క్లోజ్ వాళ్లకి తప్ప ఎవరికీ తెలియదు’’ అన్నాడు.
ఆయన గొంతు చాలా క్షమార్పణ పూర్వకంగా అంది.
‘‘వౌళికి చిన్నతనం నుంచి, ఎటువంటి కాంటాక్ట్ లేకపోవడంతో డా.రఘురాంతో తనని గుర్తించడం ఇష్టపడడు అన్నాను. వౌళి రియాక్షన్‌కి సంజాయిషీ ఇస్తూ.
‘‘నోనో వౌళి చిన్నపిల్లాడేమీ కాదు. అతని భావనలను తప్పకుండా గౌరవించాల్సిందే. పొద్దున్న పెళ్లిలో శాస్ర్తియం అనడం సాయంత్రం రిసెప్షన్‌లో పొరపాటు అనడంలో అర్థంలేదు’’ అన్నాడు మూర్తిగారు.
ఇంతలో తలుపు చప్పడవ్వగానే అందరం అటు చూశాం. వౌళి, తేజ ఇద్దరూ వస్తున్నారు.
నేను వాళ్ళు వస్తారని అనుకోలేదు. కొంచెం ఆశ్చర్యపోయాను. ఇద్దరూ హాయిగా బట్టలు మార్చుకుని రిలాక్స్‌డ్‌గా కనిపించారు. వౌళి వంక చూస్తూ ‘‘ఏమయినా మర్చిపోయావా?’’ అన్నాను.
నేను తేజ వంక చూచాను. ‘‘అమ్మ రమ్మంది’’ అంటూ కూర్చుంది.
సావిత్రి లేచి వాళ్ళిద్దరినీ లోపల గదిలోకి తీసుకువెళ్లింది. మరో ఐదు నిమిషాల తరువాత అందరూ బయటకు వచ్చారు.
వౌళిని, తేజాని కూచోమని హారతి ఇచ్చింది. సావిత్రి గుడ్‌నైట్! నౌ యు కెన్ గో అంది.
వెళ్లిపోబోతూ, తేజా చటుక్కున వంగి మా ముగ్గురికీ నమస్కారం చేసింది. తేజాని చూసి వౌళి కూడా ముందుకు వంగాడు.
మేము ముగ్గురం ఒకరి మొహం ఒకళ్ళం చూసుకున్నాం.
వౌళి, తేజా వెళ్లిపోయారు.
‘‘మీ అమెరికా వాళ్ళు ఆచార వ్యవహారాలలో చాలా వెనుకబడి ఉన్నారు’’ అన్నాను సావిత్రిని ఉద్దేశించి నవ్వుతూ!
ఆవిడ కూడా నవ్వుతూ ‘‘మా అత్తగారు నేవెళ్ళేటప్పటికి మెలకువగా కూచుని ఉంటారు. నేవెళ్లగానే ఆవిడ అడిగే మొదటి ప్రశ్న ‘‘వాళ్ళిద్దరికీ దిష్టి తీశావా లేదా?’’ అనే! రిసెప్షన్ నుంచి ఇంటికి వెడుతూ అరడజను సార్లు చెప్పారు అంది. ‘‘నేను మర్చిపోను, మీరు ఇంటికి వెళ్ళండి బాబూ’’ అని కారు ఎక్కించాను అంది సావిత్రి.
‘‘చాదస్తం డాట్ కాం అంటే మా అత్తగారు. ఇంటికి వెళ్ళగానే మా అత్తగారు ఆవిడ కొడుకుకి కూడా దిష్టితీస్తుంది’’ అని నవ్వింది. మూర్తిగారు కూడా నవ్వుతూ- నిన్ను వదిలేయడం లేదుగా అన్నారు.
‘‘రేపు నా కోడలు నన్ను గురించి ఇలాగే అనుకుంటుందా ఏమిటి?’’ అన్న ఆలోచన మెదిలింది మనసులో. తెలియకుండానే పెదిమలమీదకు నవ్వు వచ్చింది.
మర్నాడు పూజకు మళ్లీ స్నేహితులు అంతా వచ్చారు. హోటల్ వాళ్ళే మంచి ఇండియన్ రెస్టారెంట్ భోజనం నుంచి ఏర్పాటుచేసి పెట్టారు.
నేను మా గదిలోంచి ముందుగానే పూజకు కేటాయించిన గదికి వెళ్లాను. శేఖర్, శ్రీలక్ష్మి, భాస్కర్ అంతా పూజకు ఏర్పాటు చేసేశారు. చాలా భాగం మళ్లీ సావిత్రి ఏర్పాటుచేసింది.
‘‘ఇప్పుడు చెప్పండి ఆంటీ ఎలా ఉన్నామో’’ అంది తేజ చిన్న చెల్లెలు లత.
చటుక్కున వెనక్కి తిరిగి చూశాను. లత ఇద్దరి అక్కల భుజాలమీద చేతులు వేసి మధ్యగానుంచుంది. ముగ్గురూ ఒకే రకం చీరలు కట్టుకున్నారు. వాళ్ళకోసం నేనే తీసుకొచ్చాను. అందుకే ముగ్గురు కట్టుకుని వచ్చారు. వాళ్ళ ముగ్గురిలో చివరి పిల్ల చాలా చురుకు. అసలు వెస్ట్రన్ బట్టలు తప్ప వేసుకోదు. మొట్టమొదటిసారిగా చీరకట్టుకుంది.
వెనక్కి తిరిగి చూచి తృప్తిగా చిరునవ్వు నవ్వాను.
చెప్పండి- హానెస్ట్‌గా. మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తోంది?
‘‘త్రీ మంకీస్ ఆర్ త్రీ మస్కటీర్స్’’ అన్నాడు వౌళి.
వౌళీ! ముగ్గురూ అరిచారు.
‘‘మీరు చెప్పండి ఆంటీ’’ అంది.
వౌళికి ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే ఎంత బావుండేది అని.
సావిత్రి పెద్దగా నవ్వింది. లతకు అసలు అర్థం కాలేదు నేనేమన్నానో. వాళ్ళ అమ్మ వంక చూసింది. సావిత్రి విడమర్చంగానే..
‘‘గాడ్! ఐ యామ్ నాట్ గోయింగ్ టు మారీ ఆ ఎఫ్‌ఒబి’’ అంది. అందరూ నవ్వారు.
‘‘ఏం ఫర్వాలేదు. ఆంటీ ఏదో నవ్వుతూ అన్నారు. ఆవిడకు నీ సంగతి తెలియదు. తెలిస్తే అనేవారు కాదు’’ అంది సావిత్రి.
అందరూ నవ్వారు. కానీ అదీ నిజమే! అమెరికాలో పుట్టిన ఆడపిల్లలెవ్వరికీ ఇండియాలో పెరిగిన వాళ్ళను పెళ్లి చేసుకోవడం ఇష్టం కాదు. అబ్బాయిలూ అలాగే ఉన్నారు.
కల్చరల్‌గా అంత తేడా ఎలా అనిపిస్తుందో మరి.. దానికితోడు ఎవరైనా తల్లిదండ్రుల మాట విని పెళ్లిచేసుకువచ్చినా, సగానికి సగం పెళ్లిళ్లు విడాకులయిపోతున్నాయి. దాంతో అందరూ ఆ ఆలోచన విరమించుకుంటున్నారు. తేజాని అడగాలి తన ఆలోచనలు ఎలా మారిపోయాయో!
తేజ వంక చూచాను. ప్రత్యేకంగా నేను ఇండియా నుంచి తెచ్చిన నగలన్నీ పెట్టుకుంది. ఆ నగలన్నీ ఆ అమ్మాయిని పెళ్లికూతురిని చేసిన రోజే ఇచ్చేశాను. ఆ అమ్మాయికి ఇచ్చే ముందే వౌళికి చూపించాను. ఆశ్చర్యంగా నా వంక చూశాడు. ‘‘ఇవన్నీ ఇప్పుడు కొన్నావా?’’ అన్నాడు.
లేదని తల ఊగించాను. ‘‘ఇవన్నీ నా నగలు. నా పెళ్లినాటివి. నేను నా కోడలికి ఇస్తున్నాను’’ అన్నాను.
ఆ మాట వౌళికి రుచించినట్లులేదు.
‘‘నేనెప్పుడూ నువ్వు వేసుకోవడం చూడలేదు’’ అన్నాడు.
నిజమే! నేను వాటిని పెళ్లిలో తప్ప మళ్లీ వేసుకోలేదు. ఎప్పుడూ బ్యాంకు సేఫ్టీ బాక్స్‌లోనే ఉండేవి.
వౌళికి పెళ్లి నిశ్చయం కాగానే అన్నీ నగల కొట్టుకు తీసుకెళ్ళాను. అన్నీ కరిగించి వేరేగా చేయించాలని. వదిన కూడా నాతో వచ్చింది. ఇద్దరం బ్యాంకుకి వెళ్లి నగలు తీసుకుని సరాసరి నగల కొట్టుకు వెళ్లాం. ఆ కొట్టు ఓనర్‌కి నాన్న, అన్నయ్య బాగా తెలుసు.
వెళ్లగానే అన్నాను- ‘‘ఇవన్నీ చెరిపి ఏవయినా మోడరన్ నగలు చెయ్యాలి’’ అని. నా వంక ఆశ్చర్యంగా చూశాడు.
‘‘ఎందుకమ్మా ఇంత కొత్తగా ఉన్న నగలు చెరిపిస్తానంటారు’ అన్నాడు. నేను వదిన వంక చూశాను.
వదిన అంది- ‘‘ఈ పాతకాలం నగలన్నీ ఎవరు వేసుకుంటారు ఈ రోజుల్లో. అందులోనూ ఆ పిల్ల అమెరికా పిల్ల. కాస్త నాజూకు నగలు చూపించండి’’ అంది.
‘‘అయ్యో భలేవారే! మేము ఈ మధ్య ఈ రకపు నగలన్నీ అమెరికా వాళ్ళకోసమే చేస్తున్నాం. వడ్డాణం, వంకీలు, జుంకాలు అన్నీ పెట్టుకుంటున్నారు అమ్మా’’ అంటూ ఎవరికోసమో చేసి రెడీగా ఉన్నవి తీసుకువచ్చి చూపించాడు.
వదిన నా మొహంలోకి చూసింది. నేను చెరిపించాలనుకున్నదానికి కారణం అవి పాతవని ఒక్కటే కాదు, ఆ సంగతి ఆవిడకు తెలుసు. వదినకు అసలు ఇష్టం లేదు. పాత రోజులలోలాగా ఎక్కడా కల్తీ లేకుండా ఇపుడు చేస్తారనే నమ్మకమే ఆవిడకు లేదు.
కాని, నా కారణాలు వేరు. అవి రఘు ఇంటినుండి వచ్చాయి.
ఆ తాలూకు వస్తువులేవీ వౌళి ఇంటికి చేర్చడం నాకు ఇష్టంలేదు.
ఒక్క క్షణం సందిగ్ధంలో పడ్డాను. ఇవి కరిగించి చేస్తే మాత్రం బంగారం అదే కదా! రూపులు మారుతున్నాయి కాని మూలం అదే కదా! ఇక వద్దనుకుంటే ఇవి అమ్మేయాలి పూర్తిగా! అదే అనుకున్నాను.
‘‘రఘు ఇంటినుంచి వచ్చాయని నగలు ఆయితే మార్చేయగలవు. వౌళి వారసత్వం మార్చగలవా?’’ అంది వదిన, నా సందిగ్ధం చూసి.
-ఇంకాఉంది