Others

దొరికితే దొంగలు (నాకు నచ్చిన చిత్రం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందమామ బ్యానర్‌పై నిర్మాత పి చెంగయ్య నిర్మించిన సినిమా ‘దొరికితే దొంగలు’. నందమూరి తారక రామారావు, జమున హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1964 డిసెంబర్‌లో విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై ఇప్పటికి 52 ఏళ్లు. తెలుగులో తొలిసారిగా నేరపరిశోధన మరియు సైంటిఫిక్ కథాంశంతో నిర్మాణం జరుపుకున్న సినిమా. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. చిత్రంలో గుమ్మడి, కాంతారావు, ధూళిపాళ, రాజశ్రీ, శారద, రమణారెడ్డి, రాజనాల, సత్యనారాయణ, సూర్యకాంతం తదితరులు నటించారు. చిత్రంలో హీరో హీరోయిన్లు సిఐడి ఆఫీసర్లే. చిత్రంలో ప్రధాన పాత్రధారైన ధూళిపాళ తయారుచేసే ఆయుర్వేద మందుల లేపనం వలన మనుషులు కనిపించకుండా ఉండటం, కాలికి లేపనం పూసుకోవడం వలన గాలిలో ఎగరడం సరికొత్త అంశం. చిత్రంలోని పాటలన్నీ బాగుంటాయి. సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో చక్కని బాణీలతో మెలోడి ప్రధానంగా పాటలన్ని స్వరపరిచారు. ముఖ్యంగా ‘ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి పూబంతుల సంగతి’, ‘ఎవరన్నారవి కన్నులవి’, ‘ఎగురుతున్నది యవ్వనము’- ఈ సూపర్‌హిట్ పాటలకు కీశే సినారె చక్కని సాహిత్యం అందించారు. ముఖ్యంగా చిత్రంలో ఎన్టీ రామారావు, జమున చాలా అందంగా, అద్భుతంగా తమ పాత్రలను పోషించారు. చిత్రానికి పురాణం సుబ్రమణ్యం దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈయన ఐదేళ్ళ తర్వాత శోభన్‌బాబు హీరోగా నాలుగు చిత్రాలకు దర్శకత్వం చేశారు. గతించిన ఈయన కుమారుడు సూర్య కొన్ని చిత్రాల్లో నటుడిగా నటించారు. ఈ చిత్రంలో సత్యనారాయణ, గుమ్మడి పోలీస్ ఆఫీసర్లు కాగా, గుమ్మడి కొడుకు కాంతారావు విలన్ రాజనాలకు సహాయపడే పాత్రలో నటించారు. మంచి చిత్రమే అయినా అప్పట్లో యావరేజ్‌గా ఆడింది. బహుశా సంక్రాంతి టైంలో రిలీజైన సూపర్‌హిట్స్ నాదీ ఆడజనే్మ, పాండవ వనవాసం రన్నింగ్‌లో ఉండటం, రెండు వారాల తరువాత రిలీజైన మంగమ్మ శపథం ధాటికి ఈ చిత్రం యావరేజ్‌గా ఆడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ చిత్రం చూసినవారికి నచ్చుతుంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ చిత్రాలకు ఆయన చిత్రాలే పోటీ అయ్యేవి. ఈ చిత్రాన్ని జూ.ఎన్టీఆర్ కొద్ది మార్పులతో రీమేక్ చేస్తే గ్యారంటీగా హిట్ ఖాయం.

-పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి