డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం అది వ్యక్తమయ్యే బాధ కాదు. నిర్లిప్తమయిన బాధ.
ఏనాడు ఒకరితో ఏమి అనేవాడుకాదు. అయినా తనకు తెలుసు.
ఆ రోజు కాలేజీ నుంచి వస్తూ న్యూస్‌పేపర్ తెచ్చి తనకు ఇచ్చాడు. పేజీ తెరవకుండానే పెద్ద ఫొటో.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి పద్మవిభూషణ్ అందుకుంటున్న రఘు ఫొటో. ఆశ్చర్యంగా చూశాను. తెలుగు న్యూస్‌పేపర్ అంతగా కవర్ చేసినందుకు.. పూర్వం రోజుల్లో ఎంతమందికో ఇలాటి పురస్కారం లభించింది. కానీ పేపర్‌లో ఇంతగా కవర్ చేయడం చూచిన గుర్తులేదు. లేదా నేను పట్టించుకోలేదో..
తెలుగువాడు, అందులో అమెరికాలో సెటిల్ అయిపోయినవాడు. అతన్ని గురించి ఇంత పెద్ద పురస్కారం తెలుగువారికి గర్వకారణం. అందుకే ఫ్రంట్ పేజీలో వేశారు.
తల ఎత్తి వౌళి కోసం చూచాను. అక్కడ లేదు. లోపలకు వెళ్లిపోయాడు.
ఆ ఫొటో కింద అతన్ని గురించి చాలా రాశారు. ఆంధ్ర రాష్టప్రు నడిబొడ్డులో పుట్టి పెరిగి ఇంత ఖ్యాతి గణించుకున్న అతని జీవితం గురించి వర్ణిస్తూ అదొక సుదీర్ఘప్రయాణం అని రాశారు.
ప్రయాణం నిజమే! ఆ ప్రయాణంలో ఎంతమంది తోటి ప్రయాణీకులు అతని జీవితం స్పృశించారో, ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్స్ చేశారో, ఎంతమంది తోడ్పడ్డారో, ఎంతమంది కారకులు అయ్యారో, జీవితకాలపు సుదీర్ఘప్రయాణం. అలాంటి జీవనయానంలో అతి స్వల్పకాలం తానూ ప్రయాణించింది. తను గమ్యం చేరకుండానే దిగిపోయింది. ప్రయాణం కొనసాగింది.
కానీ వౌళి? వాడసలు ఆ రైలు ఎక్కనే లేదు. ఆ ప్రయాణంలో పాల్గొనలేదు. క్రిందే ఉండిపోయాడు. కానీ ఆ ప్రయాణపు ప్రభావం మాత్రం వాడిమీద పడింది. అది చెరపలేని మరకలా నిలిచిపోయింది.
నేను చూస్తుండగానే వౌళి బయటకు వచ్చి వాడు సైకిల్ ఎక్కబోయాడు.
అప్పుడే బ్యాంకు నుంచి వచ్చిన అన్నయ్య వాడిని చూస్తూ..
‘‘ఎక్కడికిరా బయలుదేరావు?’’ అన్నాడు.
‘‘ఎక్కడికి లేదు మామయ్యా!’’ ఊరికనే కాసేపు బయటకు.
‘‘లీలా మహల్‌లో మంచి ఇంగ్లీష్ సినిమా వచ్చింది.. లెట్స్ గో’’ అన్నాడు.
‘‘నేను రాను ఇవాళ, అత్తయ్యని తీసుకుపో’’ అన్నాడు.
‘‘అత్తయ్యనా... ఇంగ్లీష్ సినిమాకా? డబ్బు దండగ. హాయిగా నిద్రపోతుంది’’ అన్నాడు నవ్వుతూ. వాతావరణం కొంచెం తేలిక చెయ్యాలని.
వౌళి వౌనంగా సైకిల్ ఎక్కబోయాడు. వౌళి.. అంటూ అన్నయ్య ఏదో అనబోయాడు.
అన్నయ్య నా ముఖం వంక చూచాడు. బహుశా వౌళి మాటలలో అర్థం గ్రహించాడేమో! నాతోనూ ఏమీ చెప్పాల్సింది లేదని. తను మాత్రం ఏం చిన్నపిల్లా!
ఆ రాత్రి వౌళి వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. వాడికోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. వచ్చాక, భోజనం చేసి డాబా మీదకు వెళ్లిపోయాడు. నేను కూడా వెళ్లాను. పిట్టగోడమీద కూచుని ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు.
భుజంమీద చెయ్యి వేశాను.
చటుక్కున వెనక్కి తిరిగి నా చుట్టూ చేతులు వేసి, నా మెడ వంపుల్లో ముఖం దూర్చుకున్నాడు.
ఆ సమయంలో మాట్లాడాల్సింది ఏమీ లేదు. వీపుమీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయాను.
‘‘సాయంత్రం నుంచి ఆలోచిస్తున్నానమ్మా!’’ అన్నాడు.
‘‘దేన్నిగురించి?’’ అడిగాను తెలిసే!
‘‘ఆలోచనలు అరికట్టడం ఎలాగా అని’’.
నవ్వాలని ప్రయత్నించాను.
‘‘ఆలోచనలను ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నావా?’’ అన్నాను.
‘‘రెస్ట్‌లెస్‌గా తల ఊగించాడు. ‘‘కాదు. ఆలోచనలుతో. డిస్టర్బ్ అవకుండా ఉండటం ఎలా?’’ అని.
‘‘ఎందుకు డిస్టర్బ్ అవకుండా ఉండటం?’’ అన్నాను.
ఆశ్చర్యంగా చూచాడు.
‘‘డిస్టర్బ్ అవకుండా ఎందుకు ఆపడం?’’ మళ్లీ అన్నాను.
‘‘అది నాచురల్ రియాక్షన్. దానివల్ల నష్టం లేదు లాభమే కాని. నాచురల్ రియాక్షన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ అవర్ వెల్ బీయింగ్’’ అన్నాను.
‘‘డిస్టర్బ్ అవడం వీక్‌నెస్ కాదు. ఆ డిస్టర్‌బెన్స్ కృంగదీయకుండా జాగ్రత్తపడాలి’’ అన్నాను.
‘‘అది అంత తేలిక కాదు’’ అన్నాడు కోపంగా.
‘‘కాదు! నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు దాన్ని గురించి’’ అన్నాను.
వౌనం వహించాడు వౌళి.
‘‘వౌళి!’’ అన్నాను అనునయంగా!
‘‘నాకు చాలా కోపంగా ఉందమ్మా!’’
‘‘ఎవరిమీద?’’
‘‘నీమీద! నామీదా! రఘురాంమీద. మొత్తం ప్రపంచంమీద. గొంతు మారిపోయింది. రాబోయే దుఃఖం ఆపుకుంటున్నట్లు..
ఎందుకో తెలియదు.
ఏం చేస్తే పోతుందో తెలియదు.
ఐయామ్ జస్ట్ యాంగ్రీ!
‘‘మళ్లీ! మనం మార్చలేని విషయాలను అంగీకరించడం నేర్చుకోవాలి’’. మనం ఏదైనా చూడదల్చుకోపోతే కళ్లు మూసుకోవచ్చు. వినదల్చుకోపోతే చెవులు మూసుకోవచ్చు. కానీ జరిగేవి, వినిపించేవి, కనిపించేవి మనం ఆపలేం కదా!
.....
అవునా, కాదా? రెట్టించాను.
‘‘అసలు అతను నాకు తండ్రి అవుతాడని ఎందుకు చెప్పాడు తాతయ్య?’’
‘‘అది తెలుసుకునే అధికారం నీకు ఉంది కాబట్టి’’.
‘‘ఏం చేసుకోను ఆ అధికారంతో? అన్ని దేశాలు అతన్ని గౌరవిస్తున్నాయి, సన్మానిస్తున్నాయి- చరిత్రలో నిలిచిపోయే అంతగా! ఎన్నో రకాల పురోభివృద్ధికి కారణం అవుతున్నాడు. కానీ మనం మాత్రం ఏ విధంగానూ అతని జీవితంలో ఎందులోనూ భాగం పంచుకోలేదు. ‘వై’’? ‘‘నువ్వు కారణం ఎందుకు చెప్పవు?’’
‘‘కొన్నింటిని ప్రశ్నించి ప్రయోజనం లేదు. వాటికి సమాధానం దొరకదు’’.
‘‘అది నాకు జవాబు కాదని నీకు తెలుసు’’. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను. వాడు మరీ చిన్న పిల్లాడు కాదు. ఏదో చెప్పి మరిపించడానికి. మరీ పెద్దవాడు కాదు దులిపేసుకుని తిరగడానికి.
నా వౌనం చూస్తే వాడికి చిరాకేసింది.
‘‘నీకు బాధ అనిపించడం లేదా?’’ అన్నాడు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి