డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాకు బాధ, కోపం లేవని చెప్తే నువ్వు నమ్ముతావా?’’
‘‘నమ్మవు కదా! అది నిజమే కదా! నాకూ కోపం వస్తుంది. బాధేస్తుంది. నన్ను నా కోపాన్ని ఎవరిమీద చూపించమన్నావో చెప్పు. ఎవరిని అడగమన్నావో చెప్పు. సమాధానం ఇవ్వలసిన వ్యక్తి దరిదాపుల్లో లేనప్పుడు ఎవరిని అడగమన్నావు? నన్ను ఎలా సమాధానపడమన్నావు. నువ్వు చెప్పు?’’
‘‘నువ్వు ఒక్కటి నేర్చుకోవాలి. ఎవరి దగ్గరినుండి వారు ఇవ్వగలిగినదానికంటే ఎక్కువ ఆశించకూడదని’’ అన్నాను.
అర్థం కానట్లు చూచాడు.
‘‘రఘురాం చాలా పెద్ద సైంటిస్ట్ కావచ్చు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. ప్రొఫెషనల్‌గా చాలా పెద్దవాడవచ్చు. వ్యక్తిగతంగా చాలా చిన్నవాడయి ఉండాలి. అతని మెదడు వృత్తిపరంగానేగాని, వ్యక్తిపరంగా పనిచేయడంలేదు.పర్సనల్ విషయాలలో స్పందించడంలేదు అంతే! మనం పర్సనల్ లైఫ్‌కి చెందిన వాళ్ళం. రెండూ బాలెన్స్ చేసుకోవడం కొందరికి చేత కాదు. దే ఆర్ నాట్ కాపబుల్’’ అన్నాను. కేవలం అది వౌళికి ఇచ్చే సమాధానం మాత్రమే! నేను ఒప్పుకోగలిగే సమాధానం కాదు. నాకూ కావాలి సమాధానాలు. నాకంటే బాగా ఇవ్వగలిగే వారి దగ్గరనుంచి.
‘‘అమ్మా!’’ భాస్కరం మావయ్య ఏం రాశాడో మర్చిపోయావా? అది చదివాక కూడా అతను పర్సనల్ లైఫ్‌లో స్పందించడం చేతకానివాడనే అంటావా?’’ అడిగాడు వౌళి.
పెద్దగా నిట్టూర్చాను. భాస్కరం రాసింది ఎలా మర్చిపోతాను? భాస్కరం అమెరికా వెడుతుంటే మా నాన్న ప్రత్యేకంగా వెళ్లి అడిగాడు ‘‘రఘును ఒక్కసారి కలుసుకో. అసలు ఏం జరిగిందో కనుక్కో. ఎంత డబ్బైనా ఫర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఈ ఒక్క సాయం చెయ్యి’’ అని. భాస్కరం మా నాన్నకు మేనల్లుడు అవుతాడు.
‘‘తప్పకుండా మామయ్యా! నేను వాకబు చేస్తాను. నాకు కాస్త టైం ఇవ్వు’’ అన్నాడు.
అలాగే అమెరికా వెళ్లి నాలుగు నెలల తరువాత, రఘుని కలుసుకోవడానికి వెళ్లాడు కూడా! అప్పుడే అతను రాశాడు. ‘‘రఘురాం జీవితంలో మరొకరు ఉన్నారు. ఈ సంబంధం ఎంతవరకూ వెళ్లిందో తెలియదు. కానీ విన్నంతవరకూ సీరియస్‌గానే ఉంది. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. కల్యాణిని ఇక ముందు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పు’’ అంటూ ఆ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ప్రతి అక్షరమూ గుర్తుంది. ఎలా మర్చిపోతాను? నా మొహంలో వ్యక్తమయిన భావం చూడగానే వౌళికి చాలా పశ్చాత్తాపం కలిగింది.
‘‘సారీ అమ్మా! సారీ సారీ. ఐ యామ్ రియల్లీ సారీ’’ అంటూ గట్టిగా కౌగిలించుకుని నా మెడ వంపుల్లో తల దూర్చుకున్నాడు.
‘‘సారీ చెప్పాల్సిన అవసరం లేదు వౌళి. నీకు కోపగించుకునేందుకు సర్వాధికారాలు ఉన్నాయి. కానీ ఆ కోపం నిన్ను దహించనీయకు’’ అన్నాను.
ఆ మాట అంటూంటే గొంతు వణికింది. నాకు ఇప్పుడు రఘు ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో ముఖ్యం కాదు. ఆ రోజులు దాటిపోయాయి. నా ప్రాణం కంటే కూడా ముఖ్యం వౌళి. వాడు ఆనందంగా ఉండాలి. వాడికి అన్నీ దక్కాలి. సంతోషం, సంతృప్తి, సర్వం దక్కాలి. అదొక్కటే నా జీవిత ధ్యేయం.
తల ఎత్తకుండానే తల ఊగించాడు.
....
‘‘ఎలా ఉన్నాయి ఫొటోలు వదినగారూ’’ అంటూ సావిత్రి లోపలికి వచ్చింది టవల్‌తో చేతుదులు తుడుచుకుంటూ.
ఉలిక్కిపడి చూచాను. నా చేతిలో వౌళి ఫొటో అలాగే ఉంది. చూడాల్సిన ఫొటోలలో పదో వంతు కూడా తరగలేదు. అది కప్పిపుచ్చుకుంటూ ‘‘చాలా బావున్నాయి. సెలెక్ట్ చేయడం చాలా కష్టం. అన్నీ బావున్నాయి’’ అన్నాను.
చేతిలో ఉన్న వౌళి ఫొటో చూస్తూ ఇది చాలా బాగా వచ్చింది కదూ అంటూ ఫొటోస్ చూడటంలో మునిగిపోయింది.
తేజ, వౌళి ఇద్దరూ మూర్తిగారింటికి వచ్చేశారు. హోటల్ నుంచి మూర్తిగారింట్లో వౌళికి జరుగుతున్న మర్యాద, అటెన్షన్ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. వౌళి మాత్రం మొహమాటంలో నలిగిపోయాడు
మూర్తిగారికి మాత్రం ఆయన అత్తగారు కూడా ఇంట్లోనే ఉండటంతో మరీ హుషారుగా ఉంది. ప్రతిసారి సావిత్రిని ఆట పట్టించడం మొదలుపెట్టాడు. ‘‘మా అత్తగారు, నాకు ఇంకా బాగా వడ్డించేది నీకంటే!’’ అనేవాడు.
‘‘ఇదుగో మీరు మళ్లీ మీ అత్తగారి మాట ఎత్తారంటే మీకు భోజనం పెట్టేదిలేదు’’ అంటూ కోప్పడింది.
‘‘అత్తయ్యగారు, చూడండి సావిత్రి ఏమంటోందో’’- ఆయన పూర్తి చెయ్యకుండానే సావిత్రి తల్లి సావిత్రిని కోప్పడింది.
‘‘ఊరుకో సావిత్రి!’’ అంటూ అల్లుడి ముందు మీ యిద్దరూ పోట్లాడుకుంటారా? అంది.
మూర్తిగారు వౌళి భుజం చుట్టూలు చేతులు వేస్తూ, ‘‘అత్తగార్లు మనకో పెద్ద అస్సెట్ అనుకో. ఎందుకోగానీ, వాళ్ళకు మాత్రం మన మీద చాలా ప్రేమ ఉంటుంది’’ అన్నారు.
‘‘మరే! కూతుర్ల గారాలు భరించాలి కదా!’’ అన్నాడు సావిత్రి నాన్నగారు.
అందరూ నవ్వారు.
మధ్యహ్నం వౌళి, మూర్తిగారు, ఫ్యామిలీ రూంలో స్పోర్ట్స్ చూస్తున్నారు టీవీలో.
లత మాత్రం మొహం ముడుచుకుని ‘‘చూడు మామ్- డాడ్‌కి వౌళి ఎక్కువైపోయాడు మనందరికంటే’’ అంది కొంచెం జలస్‌గా!
పక్కున నవ్వాను వౌళి వంక చూస్తూ!
‘‘వౌళి- లత ఏమంటోందో విన్నావా?’’ అన్నాను. నా మొహంలోకి చూచి నవ్వాడు.
సావిత్రి అర్థం కానట్లు చూచింది.
‘‘నిన్న వౌళి సరిగ్గా ఇదే మాట అన్నాడు. ‘‘నాకంటే నీకు తేజ ఎక్కువయిపోయింది అని’’. నేను ఏదో తేజా మాటని సమర్థించానని అంటూ నవ్వాను. సావిత్రి కూడా నవ్వింది.
లత బుగ్గ సాగదీస్తూ అన్నాను- ‘‘ప్రేమ అపరిమితం. ఒకే వ్యక్తికి పంచినంత మాత్రాన రెండో వ్యక్తిమీద తగ్గిపోదు’’.
ఇంక వెనక్కి తిరిగి వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. వౌళి మేడమీద నుంచి మా సూటుకేసెస్ అన్నీ క్రిందకు తెచ్చేశాడు కారులో అన్నీ ఎలా పట్టించడమా అనుకుంటూ.
పొద్దున అనగా బయటకు వెళ్లిన మూర్తిగారు అప్పుడే లోపలికు వచ్చారు. చేతిలో చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది.
ఆ బాక్స్ వౌళికి అందిస్తూ- దిస్ ఈజ్ ఫర్ యూ! గోయింగ్ అవే గిఫ్ట్!
వౌళి ‘‘నాకా! ఇంకానా గిఫ్ట్స్?! ఇప్పటికే వాచ్, రింగ్స్, సూట్స్ చాలా అయ్యాయి’’ అన్నాడు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి