నెక్స్ట్ నువ్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి4 మూవీస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా ప్రభాకర్ పి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి నిర్మాత బన్నివాసు ‘నెక్స్‌ట్ నువ్వే’ అన్న టైటిల్ ఖరారు చేశారు. హిలేరియస్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో వైభవి, రష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రానున్న విజయదశమి కానుకగా విడుదల చేయనున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదలైన సందర్భంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథనం నచ్చడంతో సినిమా తెరకెక్కించామని, బుల్లితెరపై దర్శకుడికున్న పట్టు వెండితెరపైనా బాగా కుదిరిందన్నారు. ప్రేక్షకులను వందశాతం ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా సినిమా రూపొందిందని వివరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, రఘు పాత్రలు హైలెట్‌గా ఉంటాయన్నారు. చిత్రానికి కథ డికె, కెమెరా కార్తీక్ పళని, స్క్రీన్‌ఫ్లే, దర్శకత్వం ప్రభాకర్ పి.