ఫస్ట్‌లుక్ ఎలా ఇస్తాడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు ఈ చిత్రంపై అమితమైన క్రేజ్ నెలకొంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే పలు రకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై మెగా అభిమానులు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. మొత్తానికి త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదలవుతుండడంతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.