డోస్ పెంచింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం సాధారణమైన విషయం కాదు. దానికి నటనతోపాటు గ్లామర్ హంగులు జోడించాల్సిందే. ముఖ్యంగా గ్లామర్ లేనిదే ఈరోజుల్లో అవకాశాలు రావడం కష్టం. ప్రస్తుతం రఘువరన్ బిటెక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తమిళ భామ సురభికి ఆ సినిమా తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఆమె చేసిన బీరువా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే జెంటిల్‌మాన్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో ఆకట్టుకున్న సురభికి స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు రాలేదు. దాంతో గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న ఈమె, మెగా కాంపౌండ్ హీరోలతో అవకాశాలు పట్టేయాలని తెగ ప్రయత్నాలు చేస్తోందట. వాళ్ల దృష్టిలో పడేలా ఈ సినిమాలో గ్లామర్ హంగులు ప్రదర్శించేందుకు సిద్ధమైంది. మరి సురభి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి!