అది నిజం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగమ్మాయిలు సినిమాలలో నటించేందుకు ముందుకు రావడంలేదు. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు. ఏదేమైనా తెలుగు చిత్రాల్లో పరభాషా భామలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అయితే, అప్పుడప్పుడు తెలుగమ్మాయిలు కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈష అనే తెలుగమ్మాయి ‘అంతకుముందు ఆ తరువాత, బందిపోటు, మాయామాల్, అమీతుమీ’ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలు చేయడానికి ముందుకురారన్న ఓ అపోహ ఉందని, అది నిజం కాదని, పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి గ్లామర్ పాత్రలకైనా సిద్ధమవుతారని చెబుతోంది. ఇప్పుడొస్తున్న హీరోయిన్లు అందరూ దాదాపు అందరూ అందంగా ఉన్నవారేనని, ఎలాంటి చిన్న అవకాశమొచ్చినా తమ టాలెంట్ చూపిస్తామని అంటోంది. మొత్తానికి ఏ భాషా హీరోయిన్లు అయినా గ్లామర్‌ను పండించడానికి సిద్ధమవ్వాలని చెబుతోంది ఈష.. ఓకె.