టీజర్‌లో మేడమీద అబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ హీరోగా జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి రంజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం మేడమీద అబ్బాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. సినిమాకు సంబంధించిన టీజర్‌ను అల్లరి నరేష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసారు. తొలి 12 గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించిందని ఆనందం వ్యక్తం చేశాడు. మరిన్ని విశేషాలు పేర్కొంటూ కొత్తదనంతో కూడిన కథకు వైవిధ్యమైన తీరులో చెబుతున్నామని, చాలారోజుల తర్వాత ఓ మంచి సినిమా చేసామన్న భావన కలిగిందని పేర్కొంటూనే, అందరికీ నచ్చుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కొత్త కథ, సరికొత్త స్క్రీన్ ప్లేతో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా తీర్చిదిద్దారని, సున్నితమైన కథలో నరేశ్ నటించారని, రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా సహజమైన అంశాలతో సాగుతూ నరేష్ శైలి వినోదం ఉంటుందని నిర్మాత చంద్రశేఖర్ అన్నారు. ఆగస్టులోనే ఆడియో విడుదల చేసి, సెప్టెంబర్ తొలివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ మరిన్ని విశేషాలను తెలిపారు. నిఖిల విమల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్, తులసి, సుధ, సత్యం రాజేశ్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాశ్ తదితరులు ఇతరపాత్రల్లో నటించారు. చిత్రానికి కెమెరా ఉన్ని ఎస్ కుమార్, సంగీతం షాన్ రెహ్మాన్ అందిస్తున్నారు.