అబద్ధమే నిజమైతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా పేరే అబద్ధమే కనుక, హిట్టవ్వాలన్న కోరిక నిజమవ్వాలని ‘లై’ ఆడియోలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్ పేల్చాడు. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లై’ (లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటి). ఈనెల 11న విడుదలకు సన్నాహాలు చేస్తూ, హైద్రాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆడియో విడుదల చేశారు. దర్శకుడు సుకుమార్ థియేటర్ ట్రైలర్, త్రివిక్రమ్ బిగ్ సిడి, ఆడియో సిడిని విడుదల చేశారు. ఈ సందర్భంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ ట్రైలర్ చూసిన తరువాత సినిమా పెద్ద హిట్టవుతందన్న నమ్మకం కలిగిందని, సినిమా పేరు అబద్ధం కనుక నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నట్టు హృద్యంగా ఆకాంక్షించారు. నిర్మాతలు ఫ్యాషనేట్‌గా 75 రోజులపాటు అమెరికాలో షూటింగ్ చేశారని, సౌత్‌కు సంబంధించిన ఏ చిత్రం కూడా ఇన్ని రోజులు అక్కడ షూటింగ్ జరుపుకోలేదన్న హీరో నితిన్, సినిమా ఇంత బాగా రావడానికి టీమ్ మొత్తం కష్టపడ్డారని ఆనందం వ్యక్తం చేశారు. లై ఫస్ట్ లుక్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందని, దర్శకుడు యుఎస్‌లో లాంగ్ షెడ్యూల్‌లో 40 రోజులపాటు ఏ అసిస్టెంట్ డైరక్టర్ లేకుండా పని చేసాడని అన్నారు. ఆరు నెలల ప్రయాణం అప్పుడే అయిపోయిందా అనిపిస్తోందని, యుఎస్‌కు వచ్చిన యూనిట్ రేయింబవళ్లు పనిచేసారన్నాడు. హీరో తాను నమ్మిన దానికన్నా ఎక్కువగా ఔట్‌పుట్ ఇచ్చారని, ఓ మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నామన్న నమ్మకం వచ్చిందని దర్శకుడు హను అన్నారు. కార్యక్రమంలో తరుణ్ ఆదర్శ్, సుకుమార్, యువరాజ్, నిఖిత, శ్రీకాంత్, సుధాకరరెడ్డి, సంతోష్ శ్రీనివాస్, మేఘాఆకాశ్, నాజర్, సునీల్, పూర్ణిమ తదితరులు పాల్గొని చిత్రానికి సంబంధించిలు పలు విశేషాలు వివరించారు.