రావోయి మా యింటికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ్ధర్, కావ్యసింగ్, అవంతిక ప్రధాన తారాగణంగా బ్లాక్‌పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై సాకేత్ సాయిరామ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం 3రావోయి మా ఇంటికి2. డాలిభట్ నేతృత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఆడియోను బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ సీడీని విడుదల చేసి దర్శకుడు రేలంగి నరసింహారావుకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థ్రిల్లర్ కామెడీ నేతృత్వంలో తెరకెక్కిన సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాకేత్ దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి ఫాషన్‌తో చిత్రాన్ని చేశారని, స్టోరీలోనే కామెడీ హైలెట్ చేసిన విధానం అందరికీ నచ్చుతుందన్నారు. యువతతోపాటు కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని తెలిపారు. 30 శాతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, 70 శాతం కామె అంశాలతో తెరకెక్కించిన సినిమా ఇదని, ఐదు పాటలు వేటికవే ప్రత్యేకంగా డిఫరెంట్ జోనర్‌లో సాగుతాయని దర్శకుడు సాకేత్ సాయిరామ్ అన్నారు. సినిమా అంతా కామెడీగా సాగిన ప్రతి పాత్రలో వేరియేషన్స్ ఉంటాయని, నా పాత్ర రెండు మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తుందని హీరో శ్రీ్ధర్ తెలిపారు. కార్యక్రమంలో కథానాయిక అవంతిక, కె.దిలీప్‌కుమార్‌రెడ్డి, అమృత్‌పులి, డి.కె.గోయల్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.