రివెంజ్ డ్రామాగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ హీరోగా రూపొందించిన 3లై211న విడుదలవుతోంది. నితిన్ మార్కెట్‌కు తగినట్టు కథకు న్యాయం జరిగేలా చిత్రాన్ని రూపొందించాం. సినిమా తెరపై చూస్తే బడ్జెట్ తక్కువైనా సరే దాదాపు 70 కోట్ల సినిమాగా స్క్రీన్‌పై భారీగా కనిపిస్తుంది. ఓ రకంగా ఇది రివెంజ్ డ్రామా కథే కానీ, సరికొత్తగా ఉంటుందని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. మేఘా ఆకాష్, నితిన్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా రూపొందించిన చిత్రం 3లై2. ఈ సందర్భంగా హను మాట్లాడుతూ..
ప్రేమ లేనిదే సినిమా లేదు
లై -ప్రేమ ప్రధానంగా సాగిపోయే ఓ మంచి కథ. యాక్షన్‌నూ జోడించాం. అయితే నాకు తెలిసి లవ్ అనే కథ లేకుండా ఏ సినిమా కూడా ఉండదు. సినిమానిబట్టే కథనం మారుతుంది. లెవెల్ కూడా మారుతుంది. ఈ సినిమా కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది.
ఎప్పటినుంచో అనుకున్నదే
యాక్షన్ కింగ్ అర్జున్‌ను విలన్‌గా తీసుకోవడం అనే పాయింట్ ఎప్పుడో ఆలోచించుకున్నదే. ఆ పాత్రను మా మనసులోనే డిజైన్ చేసుకున్నాను. విలన్ పాత్రను రూపొందించడానికి సహజంగా ఎక్కువ సమ
యాన్ని కేటా యిస్తా. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లోనే అనేక పాత్ర లు డిజైన్ చేసుకున్నా. ఎప్పటినుంచో నితిన్‌తో సినిమా చేయాలని ఉండటం, కథతో ఇద్దరం కనెక్టవ్వడంతో సినిమా సిద్ధమైంది.
కథ డిమాండ్ చేస్తేనే
మన దేశంలోనే అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. కా నీ ఈ కథ డిమాండ్ మేరకు అమెరికాలో షూటింగ్ చేశాం. కథకు తగిన విధమైన లొకేషన్‌లనే ఎంపిక చేశాం. ప్రతి సన్నివేశం వైవిధ్యంగా వుండేలా ప్రయత్నిం చాం.
అర్జున్ ఇష్టం
యాక్షన్ కింగ్ అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూ శా. ఈ సినిమాలో విలన్ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందనుకున్నా. ఓసారి ఆయన కలిస్తే ఒప్పుకుంటారో లేదో అనే భయంతో కథ వినిపించా. ఆయనకు నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ సెంటిమెంట్‌తోనే ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం వచ్చేసింది. ప్రతి ప్రేక్షకుణ్ణి ఆనందపరుస్తుంది. డిజ్‌అప్పాయింట్ చేయదు. విలన్ పాత్ర చాలా స్టైలిష్‌గా వుంటుంది.
తదుపరి చిత్రాలు
నానితో ప్రస్తుతం ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నా. సైనికుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. సినిమా అంతా లడఖ్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే మే వరకు ఆ షూటింగ్ ప్రారంభం అవుతుందనుకుంటా. మేలోపు మరో చిత్రం చేయాలన్న ఆలోచన కూడా వుంది.

- శ్రీ