ఔను.. హద్దులు దాటేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో ఉన్న అవకాశాలను వదులుకుని నార్త్‌లో లేని అవకాశాల కోసం వెంపర్లాడి బాలీవుడ్‌లో బోర్లాపడింది ఇలియానా. ఎప్పుడో అడపాదడపా ఒకటీ అరా అవకాశాలు పలకరించటం తప్ప, బాలీవుడ్‌లో ఇలియానాకు రెడ్ కార్పెట్ పడిన దాఖలాలు లేవు. తాజాగా ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, మిలన్‌ల త్రయం చిత్రానికి హీరోలు. చిత్రంలో ఇలియానా, అజయ్‌దేవ్‌గన్‌ల మధ్య రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందని టాక్. సంచలనం కలిగిస్తున్న విషయమేంటంటే, అజయ్‌దేవ్‌గన్- ఇలియానాల మధ్య వచ్చే ఓ సన్నివేశంలో ఇలియానా హద్దులు దాటేసిందన్న వార్తలు అందర్నీ ఊరిస్తున్నాయి. ఈ కథనాలు రోజురోజుకు పెరుగుతుండటంతో -అజయ్‌దేవ్‌గన్ అలెర్టయ్యాడు. కథనాలపై స్పందిస్తూ -‘అవన్నీ అబద్ధం. అంత హద్దులుమీరి నటించడానికి ఇదేమీ అశ్లీల చిత్రం కాదు’ అంటూ చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ టీజర్, ట్రైలర్‌లలో మాత్రం ఈ చిత్రంలో రొమాన్స్ సీన్స్ బాగానే దట్టించినట్టు కనిపిస్తోంది. ఏది అబద్ధం, ఏది నిజమన్నది తేలాలంటే సినిమా విడుదల వరకూ వేచిచూడాల్సిందే.