ఫోకస్

చట్టాన్ని అతిక్రమించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాడులు అంటేనే చట్టాన్ని అతిక్రమించడం. దాడులు దళితులపైనే కాదు.. ఎవరిపైనైనా కావచ్చు.. అది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే. ప్రస్తుత సమాజంలో దళితులపైనే దాడులు జరుగుతున్నాయనుకోవడం దురదృష్టకరం. దాడులు అన్ని వర్గాల వారిపై, అంతటా జరుగుతున్న సమస్య. అయితే దళితులే లక్ష్యంగా జరిగే దాడులను ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులకు పూనుకోవడం భావ్యం కాదు. దళితులపైనే ఎక్కువ శాతం దాడులు జరుగుతున్నాయంటే వారికి చట్టాలపై అవగాహన లోపమో, తెలిసీ తెలియక కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడమో కూడా కారణం కావచ్చు. అయితే చట్ట పరిజ్ఞానం కలిగివున్నట్లయితే పరిస్థితులు పరస్పర దాడుల వరకు రావు. కారణాలు ఏవైనా దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాల్సిందే. దళితులపై దాడులను రాజకీయంగా చూడొద్దు. పరస్పర దాడులపై రాజకీయ జోక్యం ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. వర్గవైషమ్యాలను సృష్టించే వారిని శిక్షించేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. పరస్పర అవగాహన లోపం, సామరస్యం లేకపోవడమే దీనికి కారణమవుతుంది. దళితులపై దాడులు జరుగుతున్నాయంటే వారి అమాయకత్వం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. దళితులు కావచ్చు.. ఇంకెవరైనా కావచ్చు వారి వారి సమస్యలను చట్టపరిధిలో సామరస్యంగా పరిష్కరించుకుంటే ఎలాంటి ఘర్షణలు, దాడులకు తావుండదు. శాంతి, సహనం, సామరస్య పరిష్కారాలే దాడులను ఆపగల్గుతాయి. దాడుల నివారణకు ప్రజల్లో ఐక్యత, చట్టాలపై అవగాహన పెంచుకోవడం తప్ప మరే పరిష్కార మార్గం లేదు. ఇందుకు అన్ని వర్గాల ప్రజలు చట్ట పరిధిని అతిక్రమించకుండా, సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడే దళితులు, ఇతర వర్గాలు అనే భేదాభిప్రాయాలు ఉండవు.

పేర్వారం రాములు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్