నెపోలియన్.. అలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కానె్సప్ట్ పతాకంపై రూపొందించిన చిత్రం నెపోలియన్. ఆనంద్వ్రి, కోమలి నటించిన చిత్రాన్ని భోగేంద్రగుప్త మడుపల్లి రూపొందించారు. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ దర్శకుడు రూపొందించే చిత్రాల్లో కథలన్నీ బాగుంటాయని, ఈసినిమా ఆయన గత చిత్రాలకన్నా మరింత విజయం సాధిస్తుందని తెలిపారు. థ్రిల్లర్ జోనర్ మూవీ అయినా కొత్త తరహాగా ఈ సినిమా సాగుతుందని ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటారో అలా ఈ సినిమా వుంటుందని ఆనంద్ రవి తెలిపారు. నెపోలియన్ సినిమా మొదటినుండే భారీ అంచనాలతో వుందని ట్రైలర్ డిఫరెంట్‌గా రూపొందించారని ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నిర్మాత డి.ఎ.రాజు అన్నారు. నీడ ఎక్కడికి పోయింది అనే కొత్త అంశంతో రూపొందించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివుని తెలిపారు. రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్తగా వుంటుందని, నీడ కనపడకపోవడం అనేదే కొత్త కానె్సప్ట్ అని ఆ పాయింట్‌ని సినిమాలో సోషల్ అవేర్‌నెస్ పాయింట్‌తో ఎలా చెప్పారనేదే ప్రధాన అంశమని మాటల రచయిత లక్ష్మీ భూపాల్ చెప్పారు. కార్యక్రమంలో కోమలి, మార్గల్ డేవిడ్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తదితరులు విశేషాలు తెలిపారు. రవివర్మ, కేదార్‌శంకర్, మధుమణి, అల్లు రమేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: మార్గల్ డేవిడ్, పాటలు: బాలాజీ, సంగీతం: సిద్ధార్ధ్ సదాశివుని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శత్వం: ఆనంద్ రవి