సైరా అంటున్న చిరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి నటించనున్న 151వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. గత కొద్ది రోజులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రాన్ని రామ్‌చరణ్ రూపొందిస్తారన్న కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి ‘సైరా నరసింహారెడ్డి’ అనే పేరును ఖరారు చేశారు. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను దర్శకుడు రాజవౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సురేందర్‌రెడ్డి 24 శాఖలపై మంచి పట్టువున్న టెక్నీషియన్ అని, మంచి సాంకేతిక నిపుణులు వుంటే సినిమా విజయవంతం అవుతుందని తెలిపారు. ఆంజయనేయ స్వామి శక్తివల్లే తాము అడిగిన వెంటనే అమితాబ్‌బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు ఈ సినిమాలో భాగమయ్యారని, ముఖ్యంగా ఎ.పి, తెలంగాణతోపాటుగా ఇతర దేశాల్లో వున్న తమ అభిమానుల కోసమే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత రామ్‌చరణ్ అన్నారు. సైరా నరసింహారెడ్డి పేరు చెబితేనే తనకు వణుకు మొదలవుతోందని, తనపై పెద్ద బాధ్యతను వుంచారని, ప్రస్తుతం తన దృష్టి అంతా ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దడమేనని దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక వీడియో ద్వారా నటుడు చిరంజీవి మాట్లాడుతూ- తన 151వ సినిమాను స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్నామని, స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలని తనకు ఎప్పటినుంచో వున్నదని, భగత్‌సింగ్ పాత్రను చాలాసార్లు నటించాలని అనుకున్నా అది వీలుకాలేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లకు ఉయ్యాలవాడ రూపంలో ప్రేక్షకుల కోరికలకు ప్రతిరూపంగా నిలిచే ఈ పాత్ర దొరికిందని, తెలుగు బిడ్డ అయిన ఉయ్యాలవాడ పాత్ర దొరకడం గొప్ప అవకాశంగా తాను భావిస్తున్నానని అన్నారు. అత్యాధునిక సాంకేతిక బృందంతో డైనమిక్ దర్శకుడు సురేందర్‌రెడ్డి నేతృత్వంలో ఈ సినిమా అద్భుత కావ్యంగా రూపొందుతుందనడంలో సందేహం లేదని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, పరుచూరి బ్రదర్స్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్ తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు. జగపతిబాబు, సుధీప్, నయనతార, నాజర్, రవికిషన్, ముఖేష్ రుషి, రఘుబాబు, సుబ్బరాజు, వి.జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, కెమెరా:రవివర్మ, మాటలు:సాయిమాధవ్ బుర్రా, నిర్మాత:రామ్‌చరణ్, కథనం, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.