డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ చెల్లెలు తన కొడుకు కాపురం చూసి వచ్చాక మనం కూడా ఆ పని చెయ్యాలని ఆవిడ కోరిక’’ అంది వదిన.
‘‘నిజం అన్నయ్యా. అది డిఫరెంట్ అనుభవం. మనం ఇంకా చాలా చిన్నపిల్లలనుకునే మన పిల్లలు ఎంతగా ఎదిగాపోయారో, ఎంత బాధ్యత కలవారయ్యారో తెలియాలంటే వాళ్ళ ఇళ్ళకు వెళ్లి చూడాలి.
అందులోనూ, శేఖరం భార్య మంచి పిల్ల. చాలా తెలివైంది. నువ్వు నీ కొడుకు సంసారం చూసి నిజంగా సంతోషిస్తావు’’ అన్నాను.
‘‘సర్లే! వౌళి వస్తాడన్నావుగా, వాడితో వెడతాము. వంటరిగా ప్రయాణం చెయ్యడం ఇష్టం లేదు’’ అన్నాడు చివరకు ఒప్పుకుంటూ.
వదిన వంక విజయగర్వంతో చూశాను ‘విన్నావా’ అన్నట్టు.
ఆవిడ తల వూగించింది. ‘‘పద పందెం వేశావుగా! పట్టుచీర కొనడానికి’’ అంది నవ్వుతూ!
వౌళి, తేజ, మూర్తిగారి కుటుంబం అన్నట్లుగానే ఇండియా వచ్చారు. సెలవు తీసుకొని వాళ్ళకోసం విజయవాడలో మంచి హోటల్ రూమ్‌లు బుక్ చేసినా, సావిత్రి, మూర్తిగారు మాత్రం మాతోనే ఉండాలని పట్టుపట్టారు.
సావిత్రి అయితే ‘లగ్జరీ హోటల్స్ అన్నిచోట్లా వుండేవే. మీ అందరి మధ్య ముఖ్యంగా ఆదిదంపతుల్లా మీ అమ్మా నాన్నగార్లతో కలిసి రెండు రోజులు గడపాలని’ అంది.
అన్నయ్య, వదిన నేను కృష్ణానది ఒడ్డున కట్టిన హోటల్‌లో వౌళికి, తేజకి రిసెప్షన్ ఏర్పాటుచేశాం. పై వూళ్ళో నుండి అక్కయ్యలు, అన్నయ్యలు కుటుంబాలతో అందరూ వచ్చారు. నా జీవితంలో జరిపించనున్న ఏకైక వేడుకకు ఎవ్వరూ రాకుండా వుండటం ఇష్టం లేదు. దాంతో అందరూ హాజరు అయ్యారు.
అది మాత్రం అమ్మా నాన్నకి చాలా సంతోషం కలిగించింది, ఒక్కసారిగా తన బిడ్డలంతా ఒకచోట కలిసినందుకు. పోయిన పదేళ్ళలో దాదాపు యిదే మొదటిసారేమో అందరూ ఒక్క చోట కలవడం. ఎప్పుడూ ఒకరు వస్తే, ఒకరికి కుదరకపోవడంతో.
తేజా మాత్రం అమ్మా నాన్నను పరిశీలించడంలోనే మునిగిపోయింది. ఆ వయస్సులో ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే విధానం మాత్రం ముచ్చట అనిపించింది తేజాకు. ఎప్పుడూ చూచే మాకు మామూలుగానే అనిపించే ప్రతి విషయం తేజాకు మాత్రం ప్రత్యేకంగా కనిపించేది.
నిన్న నిద్రలేవగానే అమ్మ కాఫీ ఇవ్వడం, అమ్మ స్నానం చేసి వచ్చేటప్పటికి నాన్న పూజకి పూలు కోసి తెచ్చి పెట్టడం, ఇద్దరు సిమెంట్ బెంచిమీద కూర్చుని ఏదైనా మాట్లాడుకోవడం తేజకి సత్యజిత్‌రాయ్ సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది. అన్నిటికంటే నాన్న పేపర్‌లో చదివిన ప్రతి వార్త అమ్మకు చెప్పడం. తేజాకి ఏ మాత్రం సమయం దొరికినా వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్లి కూర్చునేది. ఏవేవో చిన్నప్పటి రోజుల గురించి అడిగేది.
ఒకసారి వౌళితో అంది సాలోచగా, ‘‘వౌళి అసలు వూహించగలవా మనం రుూరోజు వాడే ప్రతి వస్తువు వాళ్ళిద్దరి జీవిత కాలంలోనే ఇనె్వంట్ చేయబడ్డాయి. రేడియో, బాల్ పాయింట్ పెన్స్‌నుండి రుూరోజు కంప్యూటర్, ఇంటర్నెట్ టెక్నాలజీ వరకు, పెన్సిలిన్, యాంటి బయాటిక్స్ నుంచి ఇవాళ యాంటి రెజెస్ట్ స్టిరాయిడ్స్ దాకా, మైగాడ్. వాట్ ఏ లైఫ్ స్పాన్. ప్రపంచం ఎంత పురోభివృద్ధి జరిగిందో వాళ్ళ జ్ఞాపకాలను రికార్డ్ చేయగలిగితే అది కాలానికి ఒక ఎన్ సైక్లోపీడియా అవుతుంది’’ అంది.
‘‘అవును కదా’’ అని అనుకున్నాను. రఘు లాంటి మేధావుల కృషి, కష్టం ఫలితమే కదా ఇవన్నీ అనుకున్నాను.
ఒకసారి వెన్నుమీద ఎవరో చరిచినట్లు వులిక్కిపడ్డాను. అతను నాకిప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నాడు? వౌళి, తేజ వంక చూశాను. వాళ్ళిద్దరి సంభాషణలలో వాళ్ళు మునిగిపోయి వున్నారు.
వాళ్ళిద్దరి మధ్యవున్న స్నేహం, అన్యోన్యత బయటికి కనిపిస్తుంది. ఒకరకపు అవగాహన ఇద్దరిలోనూ వుంది. అమెరికాలో పెరిగిన తేజలో వున్న స్వాతంత్రపు ఆలోచనలు, నిర్మొహమాటం పూర్తిగా గౌరవిస్తాడు వౌళి. ఇండియాలో పెరిగిన వౌళిలో వున్న భారతీయతను సంపూర్తిగా అర్థం చేసుకుంది తేజా!
ఇలాంటి బంధమే కావాలని నా మనస్సు ఎన్నో ఏళ్ళు పరితపించింది. ఇలాంటి స్నేహం, ఆప్యాయతల కోసం నా హృదయం ఆక్రోశించింది. ‘్థంక్ గాడ్, నేను కోరివన్నీ నాకు ఇవ్వకపోయినా నా కొడుక్కు ఇచ్చావు’ అని మనఃస్ఫూర్తిగా అనుకున్నాను.
కాని నాకిప్పుడు రఘురామ్ ఎందుకు గుర్తుకువచ్చాడు.
పిల్లల ఘనతని మనఃస్ఫూర్తిగా ఆనందించేది నిజంగా తల్లిదండ్రులే! వాళ్లు బోర్లాపడినా, తప్పటడుగులు వేసినా, అమ్మా అని పిలిచినా, అది ఎంత సహజమైన పెరుగుదల అయినా తల్లిదండ్రులకు ఘనకార్యమే! గర్వకారణమే! ఒకరితో ఒకరు పంచుకుని సంపూర్ణత్వాన్ని చూడగలిగేది తల్లిదండ్రులే!
అదే తనకు దక్కలేదు. వౌళి పెరుగుదల వాడి తండ్రి ఎప్పుడూ తెలుసుకోలేదు. నా ఆనందాన్ని నేను ఎప్పుడూ పంచుకోలేదు. అది కొత్త విషయం కాదు. కాని ఇవాళ అతనెందుకు గుర్తుకువచ్చాడు? ఏమో?
‘‘వాళ్ళిద్దరూ చాలా క్యూట్‌గా వున్నారు కదా’’ అంది తేజా వౌళితో అమ్మా నాన్నల గురించి.
‘‘ఆ! ఓ అరవైఏళ్ళు మనిద్దరం కూడా కలిసి వుంటే మనమూ అలానే వుంటాం’’ అన్నాడు వౌళి.
తేజా పక్కున నవ్వింది. ‘‘నేను, మీ అమ్మమ్మలా నీకు రోజూ కాఫీ మాత్రం చేసి యివ్వను’’ అంది.
‘‘యిప్పుడిస్తున్నావా ఏమిటి, నేనేగా యిచ్చేది. అప్పుడూ నేనే యిస్తాలే మా అమ్మమ్మలా’’ అన్నాడు వౌళి.
వాళ్ళిద్దరి మాటలు విన్నవాళ్లంతా ఫక్కున నవ్వారు.
పైదేశాల్లో పెరిగిన పిల్లల్లో ఒక తేటతెల్లదనం వుంది (ట్రాన్స్‌పరెన్సీ). వాళ్ళ భావనలు సహజంగా బహిర్గతం చేస్తారు. వారి అభిప్రాయాలను వెల్లడించడానికి సందేహించరు. మనఃస్ఫూర్తిగా ఎడ్మైర్ చేస్తారు. యిప్పుడు తేజా అదే చేస్తోంది. ఆ అమ్మాయి పని చేసేది కూడా బాగా కొత్తగా వెలువడుతున్న కంప్యూటర్ టెక్నాలజీలోనే.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి