డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపార్టుమెంటులోకి వెళ్లి చెప్పులు విప్పుకుని కూచునేలోపలే వౌళి ఓ చిన్న నెగెటివ్ లాంటి కాగితాన్ని తెచ్చి నా చేతిలో పెట్టాడు.
దాన్ని చూడంగానే నాకు ఏమీ అర్థం కాలేదు. వౌళి వంక చూశాను.
‘‘నీ గ్రాండ్ ఛైల్డ్’’ అన్నాడు. ఆశ్చర్యంగా పరీక్షగా చూశాను. అల్ట్రాసౌండ్‌లో పాపాయి ఫొటో ముక్కు, చెవులు, చేతులు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏం టెక్నాలజీ, గర్భంలో వున్నా స్పష్టంగా ఫొటో, వాటి మూలంగా శిశవు, ఆడ, మగ పుట్టకుండానే తెలుసుకుంటున్నారు.
వౌళి, తేజ వాళ్ళకు తెలుసుకోవాలని లేదన్నారుట. అందుకని డాక్టర్ వీళ్లకు చెప్పలేదు. కాని డాక్టర్‌కు తెలుసు.
‘‘నీకెవరనిపిస్తోంది’’ అన్నాడు వౌళి. మళ్లీ పరీక్షగా చూశాను. కాని నాకేం తెలియలేదు. యిలాంటి వాటి గురించి ఏదో మాగజైన్‌లో చదవడం తప్ప ప్రత్యక్షంగా చూచే అవకాశం ఎప్పుడూ దొరకలేదు.
ఇండియాలో అయితే ఏమీ చెప్పకూడదని నిషేధించారు. ఆడపిల్ల అనంగానే అబార్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయని. ప్రకృతి సిద్ధంగా వుండాల్సిన సమానత్వం చెడగొడితే ఎలా? ఎవడికి వాళ్ళు స్వంత గోలే కానీ, దేశానికి ఏది మంచి అని ఆలోచించే బాధ్యత లేదు. అప్పుడే కొన్ని రాష్ట్రాలలో అయితే మగ పిల్లలకు, ఆడపిల్లలకు రేషియో బాగోలేదు.
‘అమ్మాయేమో’ అన్నాను, తేజా వంక చూస్తూ.
‘ఎందుకు అనుకున్నారు’ అంది తేజా!
భుజాలు కదిలించాడు. ఏమో అలా అనిపించింది. ‘విష్‌ఫుల్ థింకింగ్’ అన్నాను.
వౌళి తేజా వంక చూశాడు. ‘నాది మా అమ్మది ఒక్కటే కోరిక’ అన్నాడు వౌళి.
తేజా నవ్వింది. తనకు ఎవరు కావాలన్న కోరిక ఏం లేదుట. ఎవరైనా ఒక్కటే అంటుంది. వౌళికి మాత్రం అమ్మాయే కావాలనుకుంటున్నాడు. అదే అన్నాడు.
నా ఉద్దేశ్యంలో తండ్రులకు కోరుకునే హక్కులేదు అన్నాను నవ్వుతూ.
‘‘ఎంత అన్యాయం’’ అన్నాడు వౌళి.
‘‘అంతే మరీ, కష్టపడేదంతా తల్లే! అందుకే తల్లి కోరికే నెరవేరాలి’’ అన్నాను.
తేజా నవ్వింది. మీ అమ్మ నా పక్షమే! అంది, వౌళిని ఉడికిస్తూ.
‘‘మీరిద్దరూ ఫిమేల్ షావనిష్ట్స్’’ అన్నాడు వౌళి.
‘‘ఆ పదవిని అంగీకరించడానికి నాకు ఎటువంటి అభ్యరంతము లేదు’’ అంది తేజా!
వాళ్ళిద్దరూ యింకా, ఎక్కువ ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటన్నారు. నేను ఇదివరకు వెళ్ళే ముందు చెప్పాను వౌళితో. వీలైనంతగా తేజాతో తెలుగులో మాట్లాడమని. అసలు వాళ్ళెవరికి ఏ భాష మాట్లాడుతున్నామా అన్న అవగాహన లేదు. పైవాళ్ళు గుర్తుచేస్తే తప్ప.
‘‘మీరిద్దరూ ఇలాగే ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ వుంటే మీకు పుట్టబోయే పిల్లలకు ఒక్క తెలుగు ముక్క రాదు’’ అన్నాను.
వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ‘నువ్వు నేర్పు’ అన్నాడు వౌళి. తేజా కూడా అదే అంది. నేను నవ్వాను.
రుూసారి నాకు చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. అన్ని తెలిసినట్లుగా వుండటంతో తేజా డాక్టర్ ఇచ్చిన తారీఖుకి చివరదాకా పనిచేయడానికే నిశ్చయించుకుంది తేజ.
సెలవు అంతా పాపాయి పుట్టాకే వాడుకోవాలని వౌళి, తేజా యిద్దరూ కలిసే ఆఫీసుకు వెళ్ళి కలిసే తిరిగి వచ్చేవారు.
ఇంటికి రాగానే వౌళియే టీచేసి తేజాకి ఇచ్చేవాడు. సాయంత్రం విధిగా కాసేపు వాకింగ్‌కి వెళ్ళేవారు. నేను కూడా వెడితే గాని వూరుకొనేవారు కాదు.
భోజనం అయ్యాక టీవీ చూస్తుంటే వౌళి, తేజాకి ప్రత్యేకంగా కాళ్ళకు దగ్గరగా బల్ల జరిపి కాళ్ళు ఎత్తి బల్లమీద వుంచేవాడు. తన చెయ్యి తేజ పొట్టమీద వేసి బేబి కదలికలు చూస్తుండేవాడు. చెవి పొట్టమీద ఆనించి హార్ట్ బీట్ వినాలని చూసేవాడు. ఆ అమ్మాయిని అంత గారాబంగా చేస్తుంటే నాకు మనస్సుకు చాలా హాయినిచ్చేది.
తొలిసారిగా బిడ్డ పుట్టబోతూ వుంటే యిలాంటి అనుభూతులు అందరి దంతులమధ్య సర్వసామాన్యమే. ఆ అనుభవం అలాంటిది.
భార్యా, భర్తలమధ్య అది ఒక అపురూపమైన అనుబంధం. ఒక పాపాయి పూరించినంత విధంగా మరే సంఘటన చెయ్యలేదేమో!
రాత్రి ఒంటరిగా పడుకున్న నాకు మనసులో అనిపించేది ఒక్కొక్కసారి యింత సర్వసామాన్యమైన అనుభూతులు, తనకెందుకు దూరమయ్యాయి? ఇందులో తన బాధ్యత ఎంత? అది తనకు ఎప్పటికీ తెలియదేమో!
తెలుసుకుని మాత్రం ప్రయోజనం ఏముంటుంది? కదిలిపోయే కాలం, ముందుకే కాని వెనక్కు తిరిగిరాదు.
నిన్న అన్నది తిరిగిరాదు. రేపేమిటో తెలియదు. యివాళ ఎందుకిలా జరిగింది అన్న ప్రశ్న. రేపెలా జరుగనున్నదన్న అనుమానం? ప్రశ్న, అనుమానాల మధ్య యివాళ పూర్తయిపోతుంది. యివాళ గతంలోకి వెళ్లిపోతుంది. రేపు యివాళయిపోతుంది. రుూ రెండింటి మధ్య యుగాలు పూర్తయిపోతాయి. కాలం ఆగదు. ఆలోచనలు ఆగవు. మార్చలేని నిజాలు, మధనకు కారణవౌతాయి.
కళ్ళు ఎప్పుడు మూతలు పడ్డాయో, మనస్సు ఆలోచనలనుంచి ఎప్పుడు విముక్తి పొందిందో తెలియదు. కళ్ళు తెరిచేటప్పటికి మరో రోజు వచ్చేసింది.
‘‘అమ్మా మంచి అమ్మాయిల పేర్లు ఆలోచించు’’ అన్నాడు వౌళి.
వౌళి తేజా ఒప్పందం చేసుకున్నారు. అమ్మాయి పుడితే వౌళికి నచ్చిన పేరు పెట్టేటట్లు, అబ్బాయి పుడితే తేజాకి నచ్చిన పేరు పెట్టాలని. బాగానే వుంది డీల్ అనుకున్నాను.
‘‘ఇంతకీ నువ్వే పేర్లు ఆలోచించావు’’ అన్నాను.
‘‘నేనా, పొద్దునే్న పుడితే ఉష, మధ్యాహ్నం పుడితే సూర్య, సాయంత్రం పుడితే సంధ్య’’ అన్నాడు.
‘‘మరి అర్థరాత్రి పుడితేనో’’ అన్నాను.
‘నిశాచరి’’ అన్నాడు ఏమాత్రం తొణకకుండా.
తేజాకి ఆ మాటకి అర్థం తెలియలేదు. ‘అంటే’ అంది నా వంక చూస్తూ!
‘‘చీకట్లో సంచరించేవాళ్ళు, రాక్షసులు’’ అన్నాను, నవ్వుతూ!
చేతిలో వున్న పాపాయి పేర్ల పుస్తకాన్ని వౌళి మీదకు విసిరేసింది తేజా.
యు ఆర్ ఫైర్ట్ ‘‘నువ్వు చెప్పిన ఏ పేర్లు నా బేబికి పెట్టను’’ అంది చిరుకోపంతో.
‘‘పోనే్ల నీ యిష్టం వచ్చిన పేరు నువ్వు పెట్టుకో. నా ఇష్టం వచ్చిన పేరుతో నేను పిల్చుకుంటాను’’ అన్నాడు, పుస్తకం తేజాకి ఇస్తూ.
‘‘ఈ పుస్తకాలలోంచి తలా, తోకా లేని పిచ్చి పేర్లు మాత్రం మాత్రం ఏరకు’’ అన్నాడు.
‘‘వేడి వేడి పకోడీలు తీసుకువెళ్లి ఇద్దరికీ ఇచ్చాను’’ చాలా కష్టపడ్డారు, ఇద్దరు తినండి’’ అన్నాను.
‘‘మీ అమ్మ వచ్చాక నా వెయిట్ పెరిగిపోతోంది’’ అంది తేజా!
‘‘రేపు బేబి పుట్టాక నీ వెయిట్ తగ్గుతుంది. నేనేం చెయ్యను. రేపటినుంచి జాగింగ్ మొదలుపెట్టాలేమో!’’ అన్నాడు వౌళి.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి