డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో ఏ ఒక్క విషయం వలన వాటి పరిణామాలు ఆలోచించకుండా, చెయ్యలేని రోజులు వచ్చేశాయి అనుకున్నాను.
తేజా, వౌళి బాల్కనీలో కూర్చున్నారు. సాయంత్రానికి డిన్నర్ రెడీ చేశాను. వండిన పాత్రలు కూడా కడిగేశాను. వౌళి చూశాడంటే నా చేత ఒక్క గినె్న కడగనివ్వడు. అన్నీ తనే కడిగేస్తాడు. అందుకే వాడు ఆఫీసును నుంచి వచ్చేలోపలే నా పనంతా పూర్తిచేసేస్తాను. ఇక చపాతీలు చెయ్యడం ఒక్కటే.
శనివారం ఒక్కటే హాయిగా కాస్త తీరికగా మాట్లాడుకునేది వాళ్ళకు. అందుకనే వాళ్ళమధ్యలోకి వెళ్ళదల్చుకోలేదు.
చెప్పులు వేసుకుని బయటకు వచ్చాను. పెద్ద బిల్డింగ్. దాని చుట్టూ చాలా అపార్టుమెంటులు ఉన్నాయి. పూర్వపు అపార్టుమెంటు కంటే చాలా పెద్దది. అందులో చాలామంది భారతీయులు కూడా వున్నారనుకుంటాను. వీళ్ళిద్దరికీ పెద్దగా ఎవరితోనూ పరిచయం వున్నట్లు లేదు. నాకే అప్పుడప్పుడు క్రింద బట్టలు వాష్ చేసుకోవడానికి వెళ్లినపుడు కనిపిస్తూ అందరినీ చూచి ఓ చిరునవ్వు నవ్వడం, చిన్ని చిన్న మాటలు తప్ప పెద్దగా పరిచయం అవలేదు.
అవడానికి న్యూయార్క్ అయినా వీళ్ళుండే ప్రాంతం మరీ సినిమాల్లో చూచినట్లు వుండదు. రుూ అమెరికాలో మనుషుల నివాసాలు, మార్కెట్లు మామూలుగా ఒకే చోట ఉండవు..
బాగా నడవడం, ఆ పల్లెటూరు వెళ్ళాకే అలవాటయింది. విజయవాడలో నడవడం అంటే అదీ ఒక సర్కస్. వచ్చే సైకిళ్లు, కార్లు తప్పించుకుంటూ రోడ్డుమీద జారకుండా జాగ్రత్తపడుతూ నడక సాగించాలంటే పెద్ద ప్రయత్నమే!
కాని చిన్న వూర్లల్లో ఆ సౌకర్యం బాగా వుంది. రోజూ కాలేజీ అవగానే కప్పు కాఫీ తాగి ఓ మూడు మైళ్ళన్నా నడిచేదాన్ని. అదేదో ఆరోగ్యకరం అని మొదలుపెట్టకపోయినా, అలవాటు అయిపోయింది.
విజయవాడలో వున్నంతకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి నిండా మనుషులు ఉండటంతో మనసుకు ఒంటరితనం అనిపించేది కాదు. కాని వూరు మారాక ఇంట్లో నేను పని అమ్మాయి అంతే!
పని అమ్మాయి మాత్రం స్వామి భక్తి విడవకుండా చెప్పులు విప్పేటప్పటికి కాఫీ కప్పుతో నిల్చుని వుండేది.
సాయంత్రానికి కూరలు కూడా తరిగి సిద్ధంగా ఉంచేది. దాదాపు ప్రతిరోజు నేనేం తినాలో అదే నిర్ణయం చేసేసేది. అది లేకపోతే సగానికి సగం రోజులు పళ్ళతో గడిపేదానే్నమో.
అది రెడీగా వుంచిన కూరలు నేను వండనంటే తనే వండేస్తాననేది. అందుకు మాత్రం నేను ఒప్పుకునేదాన్ని కాదు. దానికి భయపడే సగం రోజులు వంట చేసేదాన్ని.
అమెరికా వచ్చినప్పటినుంచి రోజూ నేను వంట చేసేదాన్ని. ఇక్కడ అన్ని చాలా సులువు.
శుభ్రంగా తరిగిన కూరలు కూడా దొరుకుతాయి. నాకు పని కష్టం అనిపించేది కాదు
అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా మొదలుపెట్టాను. జీవితంలో ఎప్పుడూ ఇంత తీరికగా లేను.
అమెరికా వచ్చిన విజిటర్స్ అంతా ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు గానీ, నేను మాత్రం రకరకాల వంటలు, గినె్నలు కడగడం, బట్టలు ఐరన్ చేసుకోడం మాత్రం నేర్చుకున్నాను. చాలా సెల్ఫ్ సఫషియంట్‌గా తయారయిపోయాను అన్నాను వౌళితో.
‘‘నువ్వు ఎప్పుడు సెల్ఫ్ సఫీషియంటేలే’’ అన్నాడు వౌళి.
ఆ ముందు రోజు జరిగిన పాపాయిల పేర్ల సంభాషణ తలచుకుని నవ్వుకుంటూ నడవడం పూర్తిచేశాను. ఇంతకీ తేజా ఏం పేర్లు ఆలోచించుకుందో అబ్బాయికి అడగాలి అనుకున్నాను.
‘నిశాచరి’ నవ్వుకున్నాను. అమ్మ పేరు తేజశ్వని అయితే కుమార్తె పేరు నిశాచరి! చాలా బాగుంది నవ్వుకున్నాను.
నేను తలుపు తోసుకొని లోపలకు రావడం వాళ్ళు గమనించలేదు. చెప్పులు విప్పి సోఫాలో కూర్చుని, పొద్దున పూర్తి చెయ్యని న్యూయార్క్ టైమ్స్ చదువుతూ కూర్చున్నాను.
తేజా కంఠంలోంచి అత్తయ్య అన్న పదం వినిపించగానే నా ప్రమేయం లేకుండానే నా చెవులు, టెన్షన్ బాల్కనీలో సంభాషణ మీదకు పోయింది.
‘‘అత్తయ్య ఎప్పుడూ తన మనస్సులో ఏం కావాలనిపిస్తుందో బయట పెట్టదు. అందరు ఏదంటే దాన్ని ఫాలో అవడం తప్పే అంది’’ తేజ.
వౌళి నుండి సమాధానం ఏం రాలేదు. మళ్లీ తేజాయే అంది.
‘‘అందరితోనూ అంతే! అమ్మ ఎప్పుడూ తనకు ప్రత్యేకంగా ఇది చేయాలని వుంది అని ఎప్పుడూ ఎవరితోనూ అనదు’’ అన్నాడు వౌళి.
‘‘తేజా మాట్లాడలేదు’’
వౌళియే అన్నాడు! మళ్లీ తను కావాలనుకున్నవి, కోరుకున్నవి ఏమీ జరగకపోవడంతో ఏమో ఏమీ కావాలనుకోవడం మానేసిందేమో’’ అన్నాడు సాలోచనగా.
‘‘నా చిన్నప్పుడు అమ్మకు అమెరికా వెళ్లాలని చాలా ఆతృతగా ఉండేది. తన చదువయిపోయి ఉద్యోగంలో చేరాక, మరీ అనిపించేది. బయటకు అనకపోయినా ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు. కానీ ఎవ్వరికీ ఏం చెయ్యాలో మాత్రం అర్థం అయ్యేది కాదు.
మామయ్య మాత్రం ఎప్పుడూ చాలా ఉత్సాహంగా మాట్లాడేవాడు. నాకు కూడా అనిపిస్తూ ఉండేది. మేము నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు అని. అప్పుడప్పుడు మామయ్యతో అంటూ వుండేవాడిని కూడా.
‘‘మీ నాన్న మామూలు వ్యక్తి కాదురా! ఒక మేధావి. ఏదో సాధించాలని బ్రహ్మాండం బద్దలు కొట్టాలని ఓ ఆకాంక్ష. అది సాధించగానే మీరు వెడతారు’’ అనేవాడు.
మొదట్లో నాకు చాలా గర్వంగా ఉండేది. ఇంట్లో ఎవ్వరూ అతన్ని గురించి తక్కువగా మాట్లాడేవారు కాదు. నేను చాలా కలలుగంటూ వుండేవాడిని. అమెరికాని గురించి, తెలుసుకోని విషయం లేదు. జాగ్రఫీ నుంచి సమస్తం చదువుతూ వుండేవాడిని.
అమ్మతోపాటు ఆ రోజు గురించి ఆలోచిస్తూ వుండేవాడిని. అమ్మ అతనికి ఉత్తరాలు రాస్తూనే వుండేది. అటునుంచి వచ్చానో, లేనో నాకు తెలియదు. నేను ఎప్పుడు అడగకపోయినా ఏదో మాట మారిపోతూ వుండేది.
ఆ రోజుల్లో తాతయ్య ఒక టైమ్ మ్యాగజైన్ తెచ్చి అమ్మకి ఇచ్చారు.
ఆ రాత్రి అది చదివాక నేను నిజం ఏమిటో గ్రహించాను. ఆ మ్యాగజైన్‌లో అతన్ని గురించి అంతా రాశారు. ఎక్కడ పుట్టాడో, తల్లిదండ్రులెవరో, ఎక్కడ చదివాడో, ఎంతగా కృషి చేశాడో, మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నాడో అతని సక్సెస్, ఫెయిల్యూర్ అన్నింటి గురించి, అతని తోబుట్టువుల గురించి, తల్లిదండ్రుల గురించి, అంత పెద్ద వ్యాసంలోనూ పూర్తిగా మరుగున పడింది నేను, అమ్మే!
ఆ రాత్రే గ్రహించాను. మేము అతని జీవితంలో భాగం కాదు అని. అది మింగుడు పడటానికి చాలాకాలం పట్టింది. సగర్వంగా తలపునకు వచ్చే అతని రూపురేఖలు మారాయి. మనస్సు నిండా ఏదో కోపం, ఎవరిమీదో కూడా తెలియదు. కాని కోపం, ఏదో మోసపోయానన్న కోపం. అబద్ధం చెప్పారన్న కోపం. అందరిలా తనకు ఎందుకు జరగడంలేదన్న కోపం. ఒకటేమిటి ఎండ్‌లెస్. ప్రతిదానిమీద కోపమే.
ఆ కోపంలో నేనెప్పుడూ అమ్మ ఎలా వుంది, తనకేమనిపిస్తుందన్న ఆలోచనలు కూడా రాలేదు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి