డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం నా బాధే. మరొకరికి కూడా బాధ కలుగుతోంది. నా కోపం అమ్మను బాధిస్తుంది అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు ఆ రోజుల్లో అన్నాడు పెద్ద నిట్టూర్పుతో వౌళి.
‘‘అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి వౌళి అంది సానుభూతిగా తేజ!’’
‘‘అయి వుండవచ్చు అన్నాడు వౌళి’’.
‘‘ఒక సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి అమ్మ మేడ మీద వుంది. నేను పైకి వెళ్ళాను. నేను రావడం తను గుర్తించలేదు. తను కళ్లు తుడుచుకోవడం మాత్రం నేను గుర్తించాను.
అనాలోచితంగా ‘‘అమ్మా’’ అని పిలిచాను. గబాగబా కళ్ళు తుడుచుకుంటూ ఏమీ జరగనట్లే ‘ఎలా రాశావు పరీక్ష’ అంది.
తల వూగించాను బాగా రాసినట్లు. దగ్గరగా వస్తూ ‘‘ఏమయిందమ్మా, కళ్ళు అంత ఎర్రగా వున్నాయి’’ అన్నాను.
చెట్టు నుంచి ఏదో రాలి కంట్లో పడింది అంది అతి తేలికగా తీసిపారేస్తూ.
‘‘పద పద క్రిందకు అమ్మమ్మ నీకోసం ఎదురుచూస్తోంది. పాపం నువ్వు చాలా కష్టపడి పరీక్షలు రాశావని నీకిష్టమైన పకోడీలు చేసింది’’ అంది. అసలు ఏమీ జరగనట్లుగా!
ఆ రోజు గ్రహించాను రోజూ నేను ఇంట్లో చూపించే కోపం, అవే మాటలు, అమ్మను ఎంత బాధపెట్టి వుంటాయో! నాది ఒక్కటే బాధ అతని నిర్లక్ష్యం గురించి.
కాని అమ్మకు రెండు వైపుల నుంచి బాధ. నా కోపం, అతని నిర్లక్ష్యం.
చాలా బాధ అనిపించింది. ఎంత స్వార్థపరుడిగా అయిపోయాను. తలచుకుంటే ఇప్పటికీ బాధే అనిపిస్తుంది అన్నాడు.
అంతే, ఆ తరువాత నేను మళ్లీ అతని గురించి అడగలేదు, మాట్లాడలేదు. కాని అతనికి లభిస్తున్న అవార్డులు, బిరుదులు అన్ని తెలుస్తూనే ఉండేవి. తెలియనట్లు నటించేవాడిని.
అమ్మ మిగిలిన వాళ్ళు కూడా, అతని గురించి మాట్లాడటం పూర్తిగా మానేశారు. కాని తాతయ్య ఎన్నో రకాలుగా ఏదోవిధంగా అన్ని సర్దుబాటు చెయ్యాలనే చూసేవాడు.
కాని నేను, అమ్మే ఆశ్చర్యం. ఒక్క రోజు కూడా అతని గురించి చెడుగా మాట్లాడేది కాదు. తన జీవితం ఇలా ఎందుకవ్వాలని ఎవరి ముందు బాధపడేది కాదు. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కేవలం విని వూరుకునేది కాదు.
తనకు కేవలం ఒక్కటే ధ్యేయం! నేను సరిగ్గా తిన్నానో లేదో, పడుకున్నానో, బాగా చదువుతున్నానో లేదో, మరే ధ్యాస లేదు. తను నాకు ఇద్దరి ప్రేమ పంచాలని ప్రయత్నించేది.
కాని అమ్మకు అర్థం అతని విషయం ఏమిటంటే, కొన్ని అనుభూతులకు ప్రత్యామ్నాయం ఉండదని. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమని పూరించలేదు.
కాని నేను పెరుగుతున్న కొద్ది నా పరిధి పెరుగుతున్న కొద్ది చాలా నేర్చుకున్నాను. నేను అనుభవించిన బాధ కంటే అమ్మది ఎన్ని రెట్లో అని. నాకు ‘నా’ అంటూ వేరే జీవితం వుంది. కాని అమ్మ ‘నా’ అన్న అంశే పూర్తిగా కోల్పోయింది. అంతా నేనే!
నేను ఎంత తెలివిహీనుడనంటే నీతో జీవితం కలిసి గడపటం మొదలయ్యేంతవరకు నాకు ఆ ఆలోచన రాలేదు. నన్ను చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది.
కాని తేజా! ఒక విషయం చెప్పనా నీతో పరిచయం పెంచుకున్నాకే నాకు అర్థం అయింది. కంపానియన్‌షిప్ అంటే ఏమిటి?
వాళ్ళిద్దరిమధ్య మాటలు ఆగిపోయాయి. తేజా ఏదో యధాలాపంగా అన్నమాట వౌళి చేత ఎంత మాట్లాడించిందో అనుకున్నాను. గుడ్ వాడి మనసు కూడా తేలిక అవుతుంది అని అనుకున్నాను.
వౌళి ఏదో అంటున్నాడు.
‘‘నీకు తెలుసా తేజా, అప్పుడప్పుడు ఆలోచిస్తూ వుంటాను. మనం రోజూ వాడే పరిభాషలో ‘ప్రేమ’ అన్న పదం ఎంత మామూలుగా అనేస్తామో!
ప్రతి అనుబంధాన్ని ప్రేమ అని అంటూనే వుంటాం. కాని ప్రతి ప్రేమకి ఎంత తేడా వుంటుంది?
తల్లిమీద ప్రేమలో ఒక భక్తి వుంటుంది. అదే భార్య, భర్తల ప్రేమలో ఒక కోరిక వుంటుంది. పిల్లలమీద ప్రేమలో ఒక బాధ్యత వుంటుంది. అన్నీ ప్రేమలే! మనం పెరుగుతున్న కొద్ది తల్లిమీద ప్రేమ నేపథ్యంలోకి వెళ్లిపోతుంది. భార్యాభర్తల ప్రేమలో ఆధారపడటం పెరుగుతుంది. పిల్లల మీద ప్రేమ మాత్రం మారదు. పిల్లలకు తన మీద ప్రేమ నేపథ్యంలో తల్లిదండ్రులు విషయంలో మాత్రం మారదు.
మా అమ్మకు నేను పుట్టినప్పుడు ఎలా వుందో యిప్పుడూ అంతే అన్నాడు.
‘‘నువ్వు కూడా! ప్రేమమీద రీసెర్చి చేసి ఒక సైంటిస్ట్ అయిపోతావా మీ ఫాదర్‌కి మల్లే’’ అంది నవ్వుతూ!
‘‘తేజా’’ అన్నాడు కఠినంగా, బిగ్గరగా.
సారి వౌళి.
సారి నేనామాట అని వుండకూడదు. ఏదో పొరపాటుగా అంది చాలా నొచ్చుకుంటూ. కొన్ని క్షణాలు వౌనంగా దొర్లాయి వాళ్ళిద్దరిమధ్య.
‘‘ఇట్స్ ఓకె అన్నాడు తేజాతో. కాని ఓకె కాదని మా ఇద్దరికీ తెలుసు.
‘‘జన్మకి కారణం అయినంత మాత్రాన తల్లిదండ్రులయిపోరు తేజా’’ అన్నాడు వౌళి.
‘‘అదే నిజమయితే ఒక అపరిచిత అనుబంధం గురించి మనం ఇంత వ్యధ చెందం వౌళి’’ అంది.
ఆ సంభాషణ ఇంక మారితేనే మంచిది అనిపించింది నాకు.
నేను అప్పుడే వచ్చినట్లు చప్పుడు చేశాను. నేను వాళ్ళ సంభాషణ విన్నట్లు వారికి తెలియాల్సిన అవసరం లేదు. ఇద్దరూ అలా మాట్లాడుకునే అనుబంధం వుంది. వారిద్దరిమధ్య అది చాలు నాకు తెలుసుకునేందుకు.
పూర్తిగా రెండు రోజులు కష్టపడ్డాక, ఉష ప్రపంచంలోకి వచ్చింది. తేజ ప్రసవవేదన చూస్తుంటే వౌళికి మతిపోయినంత పనయింది. డాక్టర్‌గారు ఇచ్చిన తారీఖు రెండు రోజులకు ముందే వచ్చేసింది. సావిత్రి తేజాని హాస్పిటల్‌లో చేరుస్తున్నామన్న ఫోన్ వెళ్లంగానే మూర్తిగారు కూడా బయలుదేరి వచ్చేశారు.
డెలివరీ రూమ్‌లోకి వౌళిని కూడా రానిచ్చారు. బయట వెయిటింగ్ రూమ్‌లో ఉన్న మా అందరికి ఆందోళనగా ఉంది. పుట్టబోయే పిల్లకి మంచిది కాదని, తేజా ఏ మత్తు మందులు వాడనంది. పాపం చాలా కష్టపడుతోంది.
ఏ స్ర్తికి ప్రసవవేదన చూడాల్సినంత బాధాకరమైన పరిస్థితి మరొకటి వుండదు. వేదనని పూర్తిగా అర్థం చేసుకోగలిగినా ఏమీ చెయ్యలేని అసహాయ స్థితి. సావిత్రి కళ్ళల్లో నీరు తిరుగుతూనే వుంది కూతుర్ని చూస్తుంటే.
ఎత్తయిన హాస్పిటల్ విండోలోంచి బయటకు చూస్తున్న నేను అప్రయత్నంగా అన్నాను. క్రింద రోడ్డుమీద కనిపిస్తున్న అసంఖ్యాకమైన మనుష్యులను చూస్తూ- ‘‘్భగవంతుడనేవాడు ఎప్పుడయినా కనిపిస్తే నాకు ఒక్కటే ప్రశ్న వుంది అడగాలని’’ అన్నాను పెదవులు బిగబట్టి.
సావిత్రి ప్రశ్నార్థకంగా చూసింది. ఇన్ని కోట్లాది కోట్ల మనుషులకు జన్మనిచ్చిన ప్రతీ స్ర్తి రుూ నరకయాతన అనుభవించిందే! ఇంత సృష్టికి కారకురాలైన స్ర్తికి ఇంత కష్టం ఎలా పెట్టావు’’ అని.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి