డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉష ఇంటికి వచ్చాక అసలు టైము ఎలా గడిచిపోతుందో అర్థం కావడంలేదు. లేచినది మొదలు పడుకునే వరకు మా జీవితాలు పూర్తిగా దాని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. రోజూ సాయంత్రం వౌళి ఆఫీసు నుంచి వచ్చేక, పాపాయిని పూర్తిగా వాడు చూసేవాడు. వాడు మొదట్లో ప్రాణాలన్నీ బిగబట్టి పిల్లను ఎత్తుకోవడం చూచి, నర్సు చూపింది- విని మేము చేసేది చూసి కూడా వౌళి నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు.
అయినా కూడా వాడికి, తన చేతుల్లోంచి పిల్ల జారిపోతుందేమోననే అనిపించేది. తదేకంగా దానివంకే చూస్తూ వుండేవాడు. వాడికి అదో పెన్నిధి దొరికినట్లుగా వుంది. అసలు అది లేకుండా ఇన్నిరోజులు ఎలా గడిచాయా అన్నట్లుండేది.
నామటుకు నాకయితే వాళ్ళిద్దరిని చూస్తే, వౌళి తనకు దక్కనిదేదో ఉషకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపించేది. తేజ తెల్లవారుఝామున పాలిచ్చి పాపాయిని నా దగ్గర పడుకోబెట్టి, తలుపు వేసుకుని నిద్రపోయేది. అర్థరాత్రి మాత్రం అది ఎన్నిసార్లు లేచినా, వౌళికి కాని, నాకు కాని నిద్రాభంగం కలిగించేది కాదు.
ఉష కూడా పొద్దునే్న లేచి, చాలాసేపు మెలకువగానే ఉండేది. దాన్ని పొద్దునే్న ఉషోదయపువేళ దానితో గడపడం నాకు అనిర్వచనీయమైన సంతోషం కలిగేది. దాన్ని ఎత్తుకుని, అన్నమాచార్య కీర్తనలన్నీ కూనిరాగాలు తీస్తూ వుండేదానిని. అది కూడా వింటున్నట్లే అనిపించేది. అదొక తీయని అనుబంధం.
నా జీవితంలో చాలా భాగం మా అమ్మా నాన్నలతోనే గడిపాను. పోయిన కొనే్నళ్లుగా మాత్రమే ఒంటరిగా వుంటున్నది.
ఇది తెలపాలి. నా కొడుకు కుటుంబంతో గడపడం వౌళి పెళ్లికి వచ్చినా అదేదో చుట్టం చూపుగా అనిపించింది. కాని ఏదో పర్మినెంటు బంధం అనిపించలేదు.
కాని ఇప్పుడు వేరు. నాది అన్న భావం ఎక్కువైంది. అసలు కంటే వడ్డి ముద్దు అంటే ఇదే కాబోలు. వౌళి చిన్నతనంలో నేనింత ప్రశాంతంగా లేను. జీవితంలో చాలా అనిశ్చయాలు వలయాలుగా మారాయి. మనసులో ఎప్పుడో ఏదో ఒక అనుమానం, భయం, స్థిరత్వం లేకపోవడం. ఒకవిధమైన కంగారు నన్ను నిలవనిచ్చేది కాదు. మధ్యలో చదువు. ఇన్నిటిమధ్య నిజంగా, నేను వౌళి ఉనికిని పూర్తిగా ఆనందించలేదేమో!
ఇప్పుడు ఒకరమైన నిశ్చలత్వం. జీవితంలో ఇక సాధించగలిగిందేమీ లేదు. కావాలనుకున్నవి ఏవీ లేవు. నిజానికి నేనెప్పుడు ఏది కావాలని అనుకోలేదు. ఒక్క ఆర్థిక స్వాతంత్య్రం తప్ప. మిగిలినవన్నీ కలలు కనే టైముకే. కార్యాలు ముగిసిపోయాయి. కేవలం జరిగిన సంఘటన, సంఘర్షణలు కాకుండా తాపత్రయపడటం తప్ప.
అసలు ఉష పుట్టుకతోనే ఏదో తేడా కనిపించింది. కొత్త బంధం నన్ను కట్టేస్తోంది. ఎప్పుడు చేతులలో వున్నా తదేకంగా దానివంక చూడటం అలవాటయిపోయింది. దాని మొహంలో పరిచయమైన పోలికలు కనిపించేవి. చాలా వౌళి పోలికలు కనిపిస్తాయి. చిన్నప్పుడు వౌళిలో రఘురామ్ పోలికలు కనిపిస్తుంటే ఎందుకో కోపం వచ్చేది.
కాని యిప్పుడు నా కొడుకు పోలికలు నా మనుమరాలిలో చూస్తూంటే సంతోషమే కాని కోపంలేదు. ఒకసారి పాపాయిని ఎత్తుకుని చూస్తూ అన్నాను. అక్కడే వౌళి, మూర్తిగారు కూడా వున్నారు.
‘‘ఇది చాలా అన్యాయం కదూ తేజా! 9 నెలలు నువ్వు మోసావు, రెండు రోజులు కష్టపడి కన్నావు. తీరా ఉష మొహంలో ఎంత వౌళి పోలికలు కనిపిస్తున్నాయో’’ అన్నాను నవ్వుతూ!
తేజా ఏదో అనేలోగానే ‘‘అంటే నన్ను గురించే ఆలోచించేదన్నమాట రోజంతా. అందుకే నా పోలికలు వచ్చాయి’’ అన్నాడు గర్వంగా!
‘‘యు విష్’’ అలాంటిదేమీ లేదు. ఒకసారి నువ్వు ఆఫీసుకు వెళ్లాక, మళ్లీ సాయంత్రం వరకు ఒక్కసారి కూడా నిన్ను తలచుకోను. అవుట్ ఆఫ్ సైట్- అవుట్ ఆఫ్ మైండ్.
వౌళి లేచి ఉష దగ్గరగావచ్చి ‘‘చూశావా మీ అమ్మ ఎంత అబద్ధాలాడుతుందో- నెవర్ ట్రస్ట్ హర్’’.
వౌళి తేజాలలో పాపాయి పుట్టంటగానే ఒకటి గమనించాను. ఇద్దరూ తెలుగులో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటినుంచే పాపాయి ప్రతిక్షణం గమనిస్తున్నారన్నమాట.
ఓ రోజు వౌళి లేచి ఇవతలకు వస్తూ ‘‘తేజాకి నిన్న రాత్రి చాలాసేపు నిద్దరపట్టలేదట’’ అన్నాడు.
‘‘ఒంట్లో బాగానే వుంది కదా!’’ అన్నాను కొంచెం ఆతృతగా!
వౌళి ఒక్కసారిగా నవ్వాడు. ‘‘ఒంట్లో బాగానే ఉంది. నీ జోలపాటలు వింటూ నిద్రపోవడం అలవాటయిపోయిందట. నిన్న ఉష ముందుగానే పడుకోవడంతో నువ్వు పాడలేదు’’ అన్నాడు. నవ్వాను.
సావిత్రి కూడా నవ్వుతూ ‘‘మీరు మీ మనుమరాలికి యిలా రోజూ జోలపాటలు అలవాటు చేస్తే చాలా కష్టమండోయ్! మీరు రేపు ఇండియా వెళ్లిపోయాక దానికి జోలపాటలుండవ్’’ అంది.
‘‘వెళ్లేలోగా, మీకు, తేజాకి నేర్పి వెడతాలెండి’’ అన్నాను.
‘‘ఇంకా నయం, నేను పాడితే నిద్రపోవడం కాదు కదా, నిద్రపోయే పిల్ల లేచి కూచుంటుంది’’ అంది సావిత్రి.
అందరూ నవ్వారు.
‘‘వౌళి, మీ అమ్మ ఇండియా వెళ్లిపోయేలోగా ఆవిడ పాటలన్నీ రికార్డు చెయ్యాలి, లేకపోతే మీ అమ్మాయి మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది’’ అంది.
‘‘తప్పకుండా!’’ అన్నాడు వౌళి.
సావిత్రికి తేజాతో ఇంకా కొద్ది రోజులు వుందామని వున్నా వీలులేని పరిస్థితి అయిపోయింది. శశి కూడా కడుపుతో వుండటంతో ఆ అమ్మాయి ఆరోగ్యం ఏమీ బాగులేదు. గర్భిణీగా వున్నప్పుడు వచ్చే సమస్యలు చాలా చుట్టుముట్టాయి. దానితో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తోంది.
అసలే అమెరిన్ అల్లుడు. సావిత్రికి అటూ ఇటూ తిరగలేక, కూతుర్ని, అల్లుడిని ఇంటికి పిలిపించింది. దాంతో శశి ఇంట్లోనే వుంటోంది.
వెళ్లేలోపలే న్యూయార్క్ గణపతి గుడి నుండి పంతులుగారిని పిలిచి నామకరణం చేయించింది. వౌళి, తేజా స్నేహితులను పిలిచి ఉషను ఉయ్యాలలో వేసింది.
తొలి మనుమరాలు, ఏ ఒక్క వేడుక వదిలేయడం ఇష్టం లేదు సావిత్రికి.
చివరకు వూరు వెడుతూ అంది. ‘‘ఇదిగోండి. మీ మాట ప్రకారం మీ కోడలును, మనుమరాలిని జాగ్రత్తగా చూచి మీకప్పగించుతున్నాను. ఇక నా బాధ్యత అయిపోయింది’’.
‘‘ఇంకా నయం. మీ బాధ్యత అవడం అంటూ వుండదు. వీళ్లెప్పుడూ మీ బాధ్యతే! నేను ఏదో చుట్టం చూపుగా, చూచిపోయే బాపతు’’ అన్నాను.
‘‘ఇక అది మారిపోతుంది లెండి. ప్రతి ఏటా మీరు వస్తూనే వుంటారు. పిలవకపోయినా, మనుమరాలా! మజాకానా’’ అంది నవ్వుతూ!
నేను నవ్వాను. ‘‘నిజం. అసలు నేనెందుకు రావడం. ఉష నా బర్త్ డే గిఫ్ట్’’ అన్నాను. ‘‘నా బహుమతిని నేను తీసుకుని ఇండియాకి వెళ్లిపోతాను’’ అన్నాను, తేజా, వౌళి ముఖాల వంక చూస్తూ!
ఇద్దరూ నవ్వారు!
‘‘అయ్యో! మా అమ్మను, నా కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చేశావ్! ఈ రోజు జోల పాడడానికి యిప్పుడెలా!’’ అన్నాడు వౌళి.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి