సబ్ ఫీచర్

ఓనం.. మనోహరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళవాసులు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే ఓనం పండుగ వేడుకలు ముగిశాయి. బలి ఆగమనాన్ని పురస్కరించుకుని తమ సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వంగా జరుపుకునే ఓనం నయన మనోహరంగా పదిరోజుల పాటు సాగుతుందంటే అతిశయోక్తి కాదు. కేరళవాసులు దేశంలో ఎక్కడ ఉన్నా జాతి, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ సమిష్టిగా జరుపుకుంటారు. ముంగిట ముగ్గులు, ఆ ముగ్గులను పూలతో అలంకరించటం, నృత్యాలతో సాగే ఉత్సవాలు అలరారుతాయి. సంప్రదాయానికి కేరళ పెట్టింది పేరు. పండుగ సందర్భంగా తెలుపు, బంగారు వర్ణంలో ఉండే కేరళ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. చేనేతకు చెందిన ఈ చీరల కసవు అంటే బంగారు అంచు, ముండు అంటే పంచె, నెరయూతుమ్ అంటే ఉత్తరీయం. కసవు చీరలు, పంచెలు, ఉత్తరీయం తేలికగా ఉండటమే కాదు జరీ అంచులు మెరుస్తుంటాయి. ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండే వస్త్రాలు. నుదటిపై బొట్టు, కళ్లకు కాటుక, బంగారు ఆభరణాలు ధరించి కేరళ మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఒక్క ఓనం పండుగలోనే కాదు ప్రతి వేడుకలోనూ ఈ చీరలకు వీరు ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే ఈ వస్త్రం ఆరోగ్యప్రదాయిని అని వీరి నమ్మకం. ఆఖరి రోజున ఇంటి ముందు పూలతో అలంకరించి బంధుమిత్రులకు 24 రకాల వంటకాలతో ఆరటి ఆకులో భోజనం పెట్టడం విశేషం.
ఒక్కటిగా చేస్తుంది..
ఓనం పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఉండే మలయాళీవాసులను ఒక్కటిగా చేర్చుతుందంటారు తెలుగు రీజయన్ మళయాలీ అసోసియేషన్ అధ్యక్షులు బెంజమిన్.
ఇంటిల్లిపాది
సంతోషంగా..
ఈ ఏడాది ఓనం తెచ్చిన విశేషం ఏమిటంటే చేతినిండా పనిలో ఉంది. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. నౌకాదళంలో పనిచేసే మా నాన్నగారు ఎపుడు బిజీగా ఉంటారు. కాని ఈసారి పండుగకు ఇంటికి వచ్చారు. తల్లి, చెల్లెలతో ఆనందంగా జరుపుకున్నాను. స్నేహితులతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటాం.

- నిత్యా నరేష్