సబ్ ఫీచర్

శబ్ద కాలుష్యం... వినికిడి శక్తికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబ్ద మాధుర్యం రానురాను దూరమవుతుంది. ఆధునిక జీవనశైలి వల్ల ఇక ఎప్పటికీ తిరిగిరానని వీడ్కోలిస్తుందేమో! ధ్వని కాలుష్యమే అందుకు కారణం. ఆధునిక మానవుడికి రాబోయే దశకాల్లో బాహ్య చెవులు అంతరించిపోయే ప్రమాదముంది. హెడ్‌ఫోన్‌లకు అలవాటుపడిన చెవులకు సాధారణ శబ్ద ధ్వని వినపడదు. ఇరువైపులా ఎలాగూ హెడ్ ఫోన్ పరికరం ఉంటుంది కదా, ఇక బాహ్య చెవులతో పనేం ఉంది. పిలిచినా మాటాడినా ఒకరికొకరికి వినపడదు. అయితే సంజ్ఞలు, లేదంటే సెల్‌ఫోన్‌లో కాల్ చేసి హెడ్ ఫోన్‌లో వినటమే.. ఇది రాబోయే తరాల భవిష్యత్ దృశ్యం.
గణపతి ఉత్సవాలు మహాఘనంగా జరిగాయ. వీధికి రెండు మూడు వేదికలు దేశ వ్యాప్తంగా లక్షలాది విగ్రహాలు కొలువుతీరి పూజలందుకున్నాయ్. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే లక్ష దాటితే దేశ వ్యాప్త విగ్రహాల సంఖ్య ఎంతుంటుందో అంచనా వేయొచ్చు.
ఎక్కడైనా ఏ ఉత్సవాల్లోనైనా యువత స్పందనే అధికంగా వుంటుంది. యువజనం మమేకంతో ఉత్సవం ఉత్సాహమవుతుంది. ప్రత్యేకించి గణేష్ ఉత్సవాల నిర్వహణలో యువత పాత్రే కీలకం. అయతే యువత సౌండ్ పొల్యూషన్‌పై ఇంకా జాగృతం అవటంలేదు.
ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్‌ల మోత మోగింది. తీన్‌మార్ డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులు పడ్డాయ. శబ్ద కాలుష్యంతో గాలి చెల్లాచెదురై.. ప్రశాంతత పారిపోయంది. పిఓపిపై చైతన్యమైన యువత శబ్ద కాలుష్యపు హానిపై కళ్లు తెరవలేకపోతోంది. అధిక డెసిబిల్స్‌తో కూడిన శబ్దం సున్నితమైన చెవి పొరలను దెబ్బతీయటమే కదా హృద్రోగులు వృద్ధుల ఆరోగ్యాలకు చేటు తెస్తుందని పక్షులు కీటకాలను భయకంపితం చేస్తుందన్న వాస్తవం గ్రహించలేకపోతున్నారు.
చెవుల్లో దూర్చుకునే అధిక హెర్ట్‌జ్‌ల శబ్దం హైఓల్టేజి ఉల్లాసాన్నిస్తుంది. ఆ కిక్ శబ్దాన్ని నిశ్శబ్దంగా మారుస్తుంది. అధిక ధ్వనిని కోరుకొని వౌన శబ్దాన్ని కొనితెచ్చుకోకండి. మితంగా మాట్లాడమే కాదు సమాజ హితంగా వ్యవహరించాలి. ఒక దేశం అభ్యుదయాన పయనిస్తోందంటే తన దేహంలో యువరక్తం అధికంగా ఉన్నట్టు.. పాతకు భిన్నంగా వ్యవహరించటం కొత్తగా ఆలోచించటం కొంగొత్త ఆవిష్కరణలు చేయటం యువతకే సాధ్యం.. శబ్ద కాలుష్యంపై కూడా ప్రకృతిహిత పర్యావరణ సహిత కొత్త సంతకం చేయాల్సిన బాధ్యత ఉంది.

శాస్తవ్రేత్తల పరిశోధనల మేరకు.. శబ్ద ధ్వని సెకనుకు 1130 అడుగులు (గంటకు 770 మైళ్ళ) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణంగా మనం మాట్లాడే సమయంలో శబ్ద్ధ్వని 60 డెసిబుల్స్‌గా ఉంటుంది. 80 డెసిబిల్స్ దాటే ఏ ధ్వని అయినా చెవులకు హాని చేస్తుంది. ఒక నిమిషంకన్నా ఎక్కువసేపు అతి పెద్ద ధ్వనికి గురైతే మన చెవులు వినికిడి శక్తిని కోల్పోతాయి. వీధుల్లో ఏర్పాటు చేస్తున్న డీజేల్లో ఒక సౌండ్ బాక్స్ నుండే 180 డెసిబిల్స్ శబ్దం విడుదల అవుతుంది.

-కంచర్ల శ్రీనివాస్