మూలాలు మరవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేకమంది గొప్ప కళాకారులున్నారు. వారి ప్రతిభను నమ్ముకుని ఉన్నత శిఖరాలకు చేరిన కళాకారులు తమ మూలాలు మరచిపోతున్నారని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో చాలామంది ప్రతిభావంతులున్నారని, వారి కళను గుర్తించేవారు లేక నష్టపోతున్నారని, అలాంటివారికి చేయూతనిచ్చి ఇపుడున్న కళాకారులు ప్రోత్సాహమివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో జరిగిన తెలుగు సినిమా గాత్రదానం కళాకారుల సంఘ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల విడదలైన ఫిదా చిత్రంలో నటించిన సాయి పల్లవి, సినిమా రూపొందించిన నిర్మాత రాజు అభినందనీయులు అని ఆయన తెలిపారు. కార్యక్రమం లో సాయికుమార్, దర్శకుడు గుణశేఖర్ పాల్గొన్నారు.