దక్షిన తెలంగాణ

మార్పు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపుకోలేని దుఃఖాన్ని ఆవేదనగా

వెలిబుచ్చింది వరలక్ష్మి... భర్త మరణాన్ని

తట్టుకోలేక శవంపై పడి పడి ఏడ్వసాగింది.

‘వూరుకో’ అంటూ ఓదార్పుగా అంది పిన్ని

కూతురైన జ్యోతి. ఇలా ఎవరికి జరగలేదు

చెల్లీ అంటూ రోదించసాగింది.
సంప్రదాయం ప్రకారం దహనకాండ

జరిపించారు. ఇక తరువాతి కర్మక్రతువు

జరిపించే ప్రయత్నంలో వున్నారు పెద్దలు.

ఎవరు కనిపెట్టారో మూర్ఖమైన ఆచారాలు

అంది భర్తతో జ్యోతి. అత్తా, ఆడపడుచులు

సూటిపోటి మాటల నడుమ మొదలెట్టారు.

‘పెళ్లి చేయకున్నా బాగుండేదేమో’ అని

ఒకరు... ‘ఈ మహాతల్లేమి చేసిందో’ అని

ఇంకొకరు ఆ మాటలు విని కుమిలి

కుమిలి ఏడ్వసాగింది వరలక్ష్మి. వరుసకు

చెల్లెలైన జ్యోతి అప్పుడప్పుడు ఏదో ఒక రోజు

వచ్చి చూస్తూనే ఉంది మాటలు వింటూనే

ఉంది. ‘వీళ్ల మాటలు ఇలా

ఉంటున్నాయిరా’ అని చెప్పింది. ఆ

మాటకు జ్యోతి అసలు భర్తే లేకపోయిన

తరువాత వీళ్లతో నీకేం పని ఇలాంటి

రాక్షసుల మధ్య’ అంది ఆవేశంగా. ‘అవును

నిజమే’ అన్నాడు హేమంత్. ‘జాలి

చూపాల్సిన వారే వేధిస్తుంటే మీరెలా

భరిస్తారు’ అన్నా డు. జాలిగా ‘సరే ధైర్యంగా

ఉండు’ అంది స్నేహితురాలు మంజు.
మూడో రోజు వరకు అన్నం ముట్టకుండా

అలాగే ఏడుస్తూ వుంది. జ్యోతి వచ్చి

అన్నం తినిపించింది బలవంతంగా.

తిన్నాననిపించింది వరలక్ష్మి.

వెళ్తున్నామని చెప్పేసరికి ఏడుపు

మొదలెట్టింది. నీరజ్ స్నేహితుడు

హేమంత్ కూడా వచ్చాడు. ‘మీరలా

ఏడుస్తూ ఉంటే ఎలా? ఇంకా? ఏకాలంలో

ఉన్నారు. ఏడ్చే రోజులు కావివి మీలో

చైతన్యం కావాలి. మీరు చదువుకున్నారు.

అన్నీ తెలిసి ఇలా మీ జీవితానికే కొత్తదారి

వెతుక్కోవాలి’ అన్నాడు. ఆయన

మాటలకు వింతగా ఆయన ముఖంలోకి

చూసింది వరలక్ష్మి.
అమ్మగారోళ్లే తెల్ల చీర తీసుకురావాలి

అంటున్నారెవరో. పెద్దమనిషి ‘ఏం నీచ

సంప్రదాయమో’ అన్నాడు హేమంత్.

కర్మకాండకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక

మిగిలింది తెల్లవస్తమ్రు కట్టించడం, బొట్టు,

గాజులు తొలగించడం ఇదంతా పుట్టినప్పుడే

ఉన్నాయిగా మధ్యలో ఇదేంటి మరీ

మగాళ్లకు లేని ఆచారాలు ఆడాళ్లకే

ఎందుకు పీడిస్తున్నాయి అంది జ్యోతి

మానవీయ కోణంలోకి వెళ్లి..
***
నీరజ్‌తో పెళ్లయిన తరువాత వరలక్ష్మికి

కష్టాలు మొదలయ్యాయ. అతను మానసిక

అస్థితుడు. అతడి చేష్టలకు వరలక్ష్మి బాగా

కృంగిపోయింది. వంటెందుకు కూరగాయలే

తిందాము అనేవాడు. నిజంగా ఆమె అందం

చూసిన కొద్ది చూడాలనిపించే..నల్లటి

కురులతో నిగనిగలాడే తెల్లటి మేనిఛాయ.

ఆమె అందం చూసి ఓర్వలేక పోయేవారు.

అంతటి సౌందర్యవతికి అన్నీ కష్టాలే. డిగ్రీ

పూర్తికాగానే ఆమె నీరజ్ దృష్టిలోపడింది.

ఆమె పేదరికం ఆయనతో వివాహానికి

అంగీకారం కుదిర్చింది. అలాగే కొంతకాలం

తరువాత మానసిక ఒత్తిడితో అస్థిరత పెరిగి

ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సున్నితమైన

వరలక్ష్మి హృదయం - ఎలాంటోడైనాసరే!

భర్త అనుకుంటే అతనూ మరణించేసరికి

తట్టుకోలేకపోయింది.
***
అందరి మాటలు వినేసరికి కొంత

ఆలోచనలో పడింది. అత్తగారి ఆరళ్లు

ఇవన్ని ఎలా భరించాలి. జ్యోతి హేమంత్

వీళ్లంతా అనే మాటల్లో నిజం లేకపోలేదు

అనుకుంది మనసులో.. వాళ్లమ్మ

మాత్రము వరలక్ష్మిని ఓదార్చ సాగింది

‘చేసే కార్యక్రమాలు చేయనీయమ్మా’ అంది.

‘ఇంకెన్నాళ్లమ్మా ఈ నరకం’ అంది.

వరలక్ష్మి తలంటు స్నానం చేయించారు.

వరలక్ష్మి వేరే బట్టలు ధరించి ఉంది. ‘తెల్ల

చీర కట్టుకో’ అని ఓ పెద్ద మనిషి అన్నాడు.

వాళ్లమ్మ కూడ సరేనన్నట్లు చూసింది.

బాధ దుఃఖము ఆవేశం అన్నీ

వస్తున్నాయి. గుండెలు పగిలే ఆవేదన

అణుచుకుని బొమ్మలా నిశే్చష్టంగా

చూస్తోంది. సామాజికవాది అయిన

హేమంత్‌కు ఇది నచ్చలేదు. జ్యోతి కూడా

అలాగే నిలబడి చూస్తుంది. ‘బొట్టు

తీయడాన్ని ఒప్పుకోకు’ అన్నాడు

హేమంత్. ‘ఒప్పుకోకపోతే ఎవరు

పోషిస్తారామెను. నువ్వేమన్నా

పెళ్లిజేసుకుంటవా?’ అన్నారు పెద్దాయన!

‘బొట్టుకు పోషించుటకు ఏం సంబంధం?’

అంది జ్యోతి. ‘ఆమెకేం తక్కువ ఎవరైనా

చేసుకుంటారు. ఆమె ఇష్టం బొట్టు తీయడం

తీయకపోవడం. మధ్యలో మీ మూర్ఖ

వాదనలేంటి?’ అన్నాడు కోపంగా హేమంత్.

‘రా... రా.. నడువమ్మా’ అంది ఓ పెద్దావిడ.

‘నో.. నేను రాను’ అంటూ తలుపు

గడియవేసుకుంది వరలక్ష్మి. ఏమైందోనని

జ్యోతి, వరలక్ష్మి తల్లి అందరు భయపడ్డారు.

మార్పునకు సంకేతంగా ఆకుపచ్చ

చీరకట్టుకొని బయటకు వచ్చింది వరలక్ష్మి

తన గమ్యాన్ని వెతుక్కుంటూ ఇంట్లోంచి

వెళ్లింది.

- హనుమాండ్ల రమాదేవి బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా సెల్.నం.8247655600