అవకాశాల జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ‘యుద్ధం శరణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దాంతోపాటు మారుతి దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘మంచోడు’ అనే టైటిల్‌ను నిర్ణయిస్తారట. దాంతోపాటు ఇందులో హీరోయిన్‌గా ఇటీవలే నితిన్ సరసన ‘లై’ చిత్రంలో నటించిన మేఘా ఆకాష్ ఎంపికైందని వార్తలొస్తున్నాయి. మొదటి సినిమా ‘లై’తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ ప్రస్తుతం నితిన్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. ‘లై’ తరువాత మేఘా ఆకాష్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతుండటం విశేషం.