సైంటిఫిక్ థ్రిల్లర్‌తో పరిచయం: రజత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలిసారిగా ‘శ్రీవల్లి’ చిత్రం తో కథానాయకుడుగా పరిచయం అయ్యాను. తొలి సినిమాతోనే సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన చిత్రంతో పరిచయం కావడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమలో దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని వుంది అని కథానాయకుడు రజత్ తెలిపారు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీవల్లి’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. చిత్రంలో కథానాయకుడుగా నటించిన రజత్ సినిమా విశేషాలు తెలిపారు.
అలా ఎంపిక అయ్యా
చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి వచ్చా. కాలేజీ రోజులనుండే నటనపై ఆసక్తి వుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసాక సినిమాలే కెరీర్‌గా ఎంచుకున్నా. ఇంట్లో వారి ప్రోత్సాహంతో నటనలో శిక్షణ పొందాను. ఆ తరువాత ‘శ్రీవల్లి’ సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లా. నాప్రొఫైల్ నచ్చడంతో ఎంపిక చేసారు. షూటింగ్‌కు ముందుగా వర్క్‌షాప్ నిర్వహించడం మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది.
అదొక అద్భుతం
సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో నటించడం ఓ సవాలుగా భావించాను. దానితోపాటుగా ఓ అద్భుతమైన, అరుదైన అవకాశంగా కూడా అనిపించింది. దర్శకుడు సూచనలకు అనుగుణంగా నా పాత్ర తీర్చిదిద్దే ప్రయత్నం చేసా. గ్రాఫిక్స్ సినిమాలో ప్రధాన భాగం కావడంతో బ్లూమాట్‌తో చిత్రీకరించారు. మన పక్కనలేని విషయాలను ఉన్నట్టుగా ఊహించుకుని నటించడం సవాలే. సినిమాలో చివరి 20 నిముషాల్లో వచ్చే క్లైమాక్స్ అద్భుతంగా చిత్రీకరించారు.
ఆయనే స్ఫూర్తి
ఎందరో నటీనటుల మాదిరిగానే నేను కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని వచ్చాను. వృత్తిలో అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే మరింత కష్టపడాలి. ఏ పాత్రలోనైనా రాణిస్తానని న మ్మకం వుంది. ఇప్పటి ట్రెండ్‌కు తగిన విధంగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటేనే భవిష్యత్తు వుంటుంది. అలాగే నా ప్రయాణం సాగాలని కోరుకుంటా.
హ్యాపీగా వుంది
విడుదలైన రోజు నుండే ‘శ్రీవల్లి’ చిత్రానికి మంచి టాక్ రావడం ఆనందంగా వుంది. తెలిసిన వాళ్లందరూ అనేక అభినందనలు చెబుతున్నారు. ఇదే ఉత్సాహంతో సినిమా మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని వివరించారు.

- యు