ఆంధ్రప్రదేశ్‌

వైద్య సేవల తీరుపై రోగుల నుంచి సమాచార సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: ప్రభుత్వాసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై రోగుల నుంచే సమాచారం సేకరించాలని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సమాచారాన్ని సిఎం డ్యాష్‌బోర్డ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలకు సంబంధించి రోగుల నుంచి సానుకూల స్పందన వస్తుండటంపై మంత్రి కామినేని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జ్వరాల తీవ్రత, గిరిజన ప్రాంతాల్లో అందుతున్న వైద్యసేవలు 108, చంద్రన్న సంచార వైద్య సేవలు (104), బ్లడ్ కలెక్షన్ వాహనాలు, తదితర వాటిపై మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఫోన్ నెంబర్లు తీసుకుని వైద్య సేవలు అందుతున్న తీరుపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. డిఎంఈ, ఏరియా ఆసుపత్రుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేయించుకోవాలనే విధంగా ఆసుపత్రులను తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆరోగ్య కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సిఎంను కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ హెల్త్ కాంప్లెక్స్‌లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాలు, హెల్త్ యూనివర్సిటీలతో పాటు అనుబంధంగా ఉన్న పారా మెడికల్, తదితర బోర్డులన్నీ ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను డిఎం అండ్ హెచ్‌ఓలు తరుచూ ఆకస్మిక తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. విశాఖలో ఉన్న ఫుడ్ ల్యాబ్‌ను స్టేట్ ఫుడ్ ల్యాబ్‌గా విస్తరించాలని అధికారులకు సూచించారు. ఆర్థికశాఖ అధికారులతో చర్చించి విమ్స్‌లో 110 మంది సిబ్బంది నియామక ప్రక్రియను త్వరగా చేపట్టాలని చెప్పారు. చేపల చెరువుల్లో నిషేధిత యాంటీబయాటిక్స్ వాడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. అలాగే అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ నర్సుల సమస్యలను రెండువారాల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.