రాష్ట్రీయం

యుకె వైపు భారతీయ విద్యార్థుల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల వీసా విధానాన్ని కఠినతరం చేయడంతో భారతీయ విద్యార్థుల దృష్టి మిగిలిన దేశాలపై పడింది. ప్రధానంగా తూర్పు ఆసియా దేశాలపైనా, రష్యా, ఐరోపా దేశాలు, బ్రిటన్‌పై పడింది. విదేశాల్లో దాదాపు 10 లక్షల మంది చదువుతుండగా, సగటున రెండు లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. దాదాపు అదే సంఖ్యలో నేడు యుకెకు వెళ్తున్నారు. ఐరోపా, రష్యా దేశాలలో కలిపి దాదాపు లక్ష మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఈ సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్శిటీల్లో విద్యను అభ్యసించేందుకు దక్షిణ భారత దేశ విద్యార్థులు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి. అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గత ఏడాది 9 శాతం పెరిగినట్టు చెన్నైలోని బ్రిటిష్ డిప్యుటీ హై కమిషనర్ భరత్ జోషి చెప్పారు. అలాగే విజిటింగ్ వీసాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించిందని ఆయన వివరించారు. యుకె వెళ్లడానికి జారీ చేస్తున్న వీసాల్లో 80 శాతం విజిటింగ్ వీసాలు కాగా, రెండో స్థానంలో వర్కింగ్ వీసాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మార్చి 2017 వరకూ 4.14 లక్షల వీసాలు జారీ చేయగా వాటిలో 11,700 స్టూడెంట్ వీసాలు, మరో 5000 షార్టు టెర్మ్ స్టడీ వీసాలు, 60వేలు వర్కింగ్ వీసాలు ఉన్నాయి. యురోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటకు రావడం వల్ల అక్కడ నియమాలు, నిబంధనల్లో చాలా మార్పు వచ్చిందని, అందుకే విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని జోషి అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా వీసాలకు సంబంధించి 10 శాతానికి పైగా దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. బ్రిటన్ ఉన్నత విద్యకు అనేక రకాల ఉపకార వేతనాలు అందిస్తున్నా, అందుకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు రావడం లేదని, విశ్వవిద్యాలయాల చుట్టూ తిరిగి, సామాజిక మాద్యమాల్లోనూ పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేపట్టినా, గత ఏడాది చెవినింగ్ స్కాలర్‌షిప్‌నకు కేవలం వంద దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు.