నవంబర్‌లో ఖాకీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కార్తీక్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా తమిళంలో విజయవంతమైన ‘్ధరన్ అధిగారం ఒండ్రు’ చిత్రాన్ని తెలుగులో ఆదిత్యా మ్యూజిక్స్ అందిస్తోంది. ద పవర్ ఆఫ్ పోలీస్ అనేది ఉపశీర్షిక. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 27న, ట్రైలర్‌ను వచ్చేనెల 17న, సినిమాను నవంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమేష్‌గుప్తా మాట్లాడుతూ 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు కథను సిద్ధం చేశారని, ఈ సినిమా చూసి తెలుగులో అందించాలన్న కోరికతో రైట్స్ తీసుకున్నామని తెలిపారు. పవర్ఫుల్ పోలీసు అధికారికా కార్తీ వైవిధ్యంగా నటించారని, ఆయన లుక్స్, ఫిజిక్ పట్ల కేర్ తీసుకున్నారని తెలిపారు. అభిమన్యుసింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిస్ విల్సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సత్యన్ సూరన్, ఎడిటింగ్:శివనందీశ్వరన్, నిర్మాతలు:ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా, దర్శకత్వం:హెచ్.వినోద్.