AADIVAVRAM - Others

త్వరగా అలసిపోతున్న వారికి తక్షణ శక్తిదాయకాలు ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: నా వయసు 30 సం.లు. సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తున్నాను. ఊరికే అలసిపోతున్నాను. అన్ని పరీక్షలూ చేసి ఏమీ లేదంటున్నారు. ఎలా తగ్గించుకోవాలో వివరంగా చెప్పగలరు.
జ: బుర్ర వేడెక్కిపోతోంది! మానసికంగా అలసిపోతున్నా! జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది! ఆలోచనలు సాగటం లేదు! బుర్ర సరిగా పని చేయట్లేదనిపిస్తోంది... ఇలా అనిపిస్తున్న వారికి లైఫ్ స్టైల్‌లో కొద్దిపాటి మార్పులు అవసరం అవుతాయి.
చిన్న పనికే ఎక్కువ అలసిపోవటాన్ని fatigue అంటారు. abnormal exhaustion after normal activities - అని దీని నిర్వచనం. ఇది అశ్రద్ధ చేయాల్సిన అంశం కాదు. అలసట, అశక్తత, దేనిపట్లా ఆసక్తి లేకపోవటం, పట్టనితనం, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ ఈ ఫెటిగ్ అనే పరిస్థితిలో కన్పించే లక్షణాలు. ఫెటిగ్ అనేది ఒక వ్యాధి కాదు, ఒక లక్షణం. ఇది తాత్కాలికంగా కొంతకాలంపాటు కొనసాగవచ్చు. కొందరిలో దీర్ఘవ్యాధిగా మారి, పదేపదే అలవాటుగా రావచ్చు కూడా! దీర్ఘవ్యాధిగా వచ్చే నిస్త్రాణతనిChronic fatigue syndrome CFS అంటారు.
ఈ లక్షణాలకు తోడు కీళ్లనొప్పులు, మలబద్ధత, మూత్రం ఆపుకోలేక పోవటం, వినికిడి సమస్య, మానసిక ఆందోళనలు, వొంటరితనం ఆవహించటం కూడా ఉండవచ్చు. రక్తహీనత కూడా కలగవచ్చు.
15-30% యువతీ యువకుల్లో అడపాదడపా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. కాగా, 05-2% యువతలో ఇది తీవ్ర స్థాయిలో ఉన్నట్టు భావిస్తున్నారు.
ఎనర్జీ స్థాయి అనేది అందరికీ ఒకే తీరులో ఉండదు. శారీరకంగానీ, మానసికం గానీ, కొద్దిపాటి శ్రమకే కొందరు ఎక్కువ అలసిపోతారు. ఇందుకు శారీరక మానసిక కారణాలను వెంటనే తేల్చటం కష్టం కావచ్చు. Poor functioning.. ‘ఫని సమర్థత’ తగ్గిపోవటం అనేది ఇందులో ప్రధానంగా కనిపించే విషయం. కెరీర్ నిర్మించుకునే పనిలో ఉన్న యువతకు ఇలాంటి పరిస్థితి కలిగితే అది కెరీర్‌ని తప్పకుండా దెబ్బతీస్తుంది.
ఇందుకు కారణం ఇదీ అనేది ఇతమిత్థంగా తేలలేదు. కారణం తెలీని లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మెటబాలిజంలో తేడా, ఆక్సిజన్ మెదడుకు తగినంతగా అందకపోవటం, హార్మోన్లలో తేడా, మానసిక వత్తిడి ఇవన్నీ కారణాలు కావచ్చు. రక్తహీనత ఒక ప్రధాన అంశం కూడా! థైరాయిడ్ లోపం కూడా ఇందుకు దారి తీయవచ్చు. ఇవేవీ కాకుండా చాలినంత నిద్ర లేకపోవటం వలన ఫెటిగ్ పదేపదే కలిగే అవకాశం ఉంది. షుగరు పరీక్షలు కూడా చేయించుకోవటం మంచిది.
ఉసిరికాయ తొక్కుపచ్చడి (నల్లపచ్చడి) ప్రతీరోజూ ఒక చెంచా మోతాదులో అన్నంలో కలుపుకుని తినండి. అకారణంగా వచ్చే ఫెటిగ్ తగ్గుతుంది.
ఎండిన ఉసిరికాయ లోపలి గింజలు తీసేసి బెరళ్లను మిక్సీ పట్టి, ఆ పొడిని టీలాగా కాచుకుని రోజూ రెండు పూటలా తాగుతూ ఉంటే ఫెటిగ్ తగ్గుతుంది.
ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ మూడింటినీ త్రిఫలాలని పిలుస్తారు. ఈ మూడింటి పొడి, త్రిఫలా చూర్ణం పేరుతో ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దీన్ని రోజూ ఒక చెంచా మోతాదులో రెండు పూటలా తీసుకునే వారికి అకారణంగా వచ్చే ఫెటిగ్ కలగకుండా ఉంటుంది.
తలకు చందనాది తైలం మర్దన చేసుకుంటే మెదడుకు చలవ కలుగుతుంది. అలసట తీరుతుంది.
గుంటకలగర మొక్కలు నీటి కుంటల దగ్గర ఉచితంగా పెరుగుతాయి. కూరగాయలు అమ్మేవారిని అడిగితే తెస్తుంటారు. దీని లేత ఆకుల్ని గోంగూర, చుక్కకూర ఇతర ఆకుకూరల్లో దేనితోనైనా కలిపి తరచూ వండుకుని తినవచ్చు. రుచికరంగానే ఉంటుంది. ఇది బుద్ధివర్థకం, రక్తవర్థకం. ఉత్సాహాన్నిస్తుంది. జుట్టు నల్లబడుతుంది.
భాండీలో కొద్దిగా నెయ్యి వేసి మిరియాలను నూకలాగా దంచిన పొడిని అందులో వేసి దోరగా వేయించి ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. దీన్ని ఘృతమరీచి అంటారు. ఒక చెంచా ఘృతమరీచిని అన్నంలో మొదటి ముద్దగా తినే అలవాటు చేసుకుంటే ‘ఫెటిగ్’ తగ్గుతుంది. ఇది బుద్ధి వర్థకం. పరీక్షలకు వెళ్లే పిల్లలకు తప్పనిసరిగా పెట్టండి. కెరీర్ ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారు ఘృతమరీచి రోజూ తినాలి.
5 గ్రాముల జాజికాయ, 5 గ్రాముల జాపత్రి, 2 గ్రాముల పచ్చకర్పూరం ఈ పాళ్లలో తీసుకుని మిక్సీ పట్టుకున్న పొడిని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. రాత్రి పడుకోబోయే ముందు రోజూ పావుచెంచా పొడిని గ్లాసు వేడివేడి పాలలో కలుపుకుని తాగుతూ ఉంటే ఫెటిగ్ రాకుండా ఉంటుంది. మానసిక అలసట తీరుతుంది. కమ్మని నిద్ర పడుతుంది.
రాత్రిపూట 7-8 తులసాకుల్ని గ్లాసు నీళ్లలో వేసి ఉంచండి. ఉదయానే్న ఆ నీళ్లను ఆకులతో సహా తీసుకోండి. రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
వస కొమ్ములు దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. పావుచెంచా వస పొడిని, యాలకులు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, పొదీన, తులసాకులు వగైరా ఎండబెట్టి మిక్సీ పట్టిన పొడిని తగినంత కలిపి టీ కాచుకుని తాగుతుంటే చాలా ఉల్లాసభరితంగా ఉంటుంది.
మానసిక అలసటకు చాలామంది విషయంలో తాను తన శక్తికి మించిన శ్రమ పడ్తున్నానన్న భావన ప్రధాన కారణం. నిజానికి మన మెదడుకు ఉన్న శక్తికి సరిపడిన చెప్పటానికి మన దగ్గర అంత పని లేదు. అలసిపోవటం అనేది కూడా ఒక మానసిక భావనే కావచ్చు. మనోబలంతోనూ, దృఢ సంకల్పంతోనూ దీన్ని ఎదుర్కోవాలి. సాధారణంగా ఇది ఒక వ్యాధి కాకపోవచ్చు. మనకు మనంగా ఇందులోంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com