సూపర్ కాప్‌గా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు వర్మ చాలారోజుల తరువాత నాగార్జునను ఒప్పించాడు. ‘శివ’తో నాగార్జునకు కొత్త ఇమేజ్ అందించిన వర్మ, ఆ తర్వాత ‘గోవిందా గోవిందా’ చిత్రాన్ని తీశాడు. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ నాగార్జునతో ‘శివ-2’ చిత్రానికి కమిట్ అయ్యాడు. తాజాగా ఈ సినిమాకు నాగార్జున కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న వర్మ, నాగార్జునతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే ఓ సూపర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడట. నవంబర్ 20న ప్రారంభం అయ్యే ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఏమిటో తెలుసా.. సూపర్ కాప్ అంట! సూపర్ కాప్ కథతో ఈ సినిమా స్టయిలిష్ మేకింగ్‌లో ఉంటుందట. సూపర్ కాప్ అనగా వర్మ కామన్ ఎలిమెంట్స్.. మాఫియా తప్పకుండా ఉంటుంది కదా.. మరి ‘శివ’తో సంచలనం క్రియేట్ చేసిన వర్మ.. రెండో ‘శివ’తో ఎలాంటి సంచలనం రేపుతాడో చూడాల్సిందే!