ఫోకస్

పర్మనెంట్ ఉద్యోగులతోనే నాణ్యమైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలకు సుపరిపాలన అందిస్తామని పదే పదే చెబుతూ వచ్చే పాలకులు వివిధ ప్రభుత్వ శాఖల్లో నిర్దేశిత ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయటంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఏపీలో మండల వ్యవస్థకు అంకురార్పణ జరిగినప్పుడు 1983లో నాటి జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అన్ని క్యాడర్లలోను నిర్దేశించిన పోస్టుల్లో ఇప్పటికి దాదాపు రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన రెవెన్యూ శాఖలోనే రెండువేల విఆర్‌వో పోస్టులు, రెండువేల జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, వాచ్‌మెన్‌ల పోస్టులు ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నాయి. చట్టప్రకారం ప్రతి ఐదుగురికి ఒక నర్సు ఉండాలి.. 50 మందికి ఒకరున్నారు. ఉద్యోగులపై పనిభారం పెరిగి మానసిక ఒత్తిడికిలోనై గుండెకు సంబంధించిన వ్యాధులు, హైబీపీతో పక్షవాతానికి గురవుతున్నారు. కాంట్రాక్ట్ పేరిట 35వేల మంది, ఔట్‌సోర్సింగ్ పేరిట 80వేల మంది పనిచేస్తున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ జీతాలు లేకపోవటం, ఉద్యోగ భద్రత లేకపోవటంతో వారిలో జవాబుదారీతనం ఉండటం లేదు. అయినా వీరిపై శాఖాపరమైన చర్య తీసుకునే అధికారం లేదు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసేవారిని ఎడాపెడా తొలగిస్తున్నారు. ఒక్క హౌసింగ్ బోర్డులోనే రెండువేల మంది, ఆయుష్ విభాగంలో 1110 మంది కాంపౌండర్‌లను తొలగించారు. సమాన పనికి సమాన వేతనం లేకపోవటంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దీనివలన కొత్త నియామకాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడం, ఔట్‌సోర్సింగ్ వారికి చట్ట ప్రకారం ఇఎస్‌ఐ, పిఎఫ్ వర్తింప చేయాలి. అప్పుడే ప్రజలందరికీ మెరుగైన సేవలందగలవు.

- బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్