మన కథలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య అన్న పేరుతో ఈ చిత్రంలో కనిపిస్తా. నా స్నేహితుల కోసం నేను ఏం చేశాను అనేదే ఈ సినిమా కథ. మన చుట్టుప్రక్కల జరిగిన కథలా ఈ చిత్రం సాగుతుంది అని హీరో సందీప్ కిషన్ తెలిపారు. తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్, మెహరీన్ జంటగా రూపొందించిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం గురించి కథానాయకుడు పలు విశేషాలు తెలిపారు.
సూర్య అంటే
చిన్నప్పుడు అమ్మా నాన్నలు మనకు కేరాఫ్ అడ్రస్‌గా వుంటారు. ఎవరేమన్నా వారికి చెప్పుకుంటాం. అలాగే, ఈ చిత్రంలో కథానాయకుడి స్నేహితులు కేరాఫ్ సూర్య అడ్రస్‌గా పెట్టుకుంటారు. ఎవరేమన్నా సూర్య ఉన్నాడ్రా అన్న ధైర్యంతో స్నేహితులు చెబుతుంటారు కనుక కేరాఫ్ సూర్య అన్న పేరును ఖరారు చేశారు.
వైల్డ్‌నెస్ ఎక్కువ
సూర్య సినిమా చూసినవాళ్లకు సుశీంద్రన్ సినిమాలో వైల్డ్‌నెస్ ఎక్కువగా వుంటుందన్న మాట నిజమనిపిస్తుంది. అయితే చాలావరకు ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం చేశారు. అయితే కథలో ఎమోషన్ మాత్రం అలాగే వుంటుంది. ఆయన చిత్రాలు నిజ జీవితానికి దగ్గరగా వుంటాయి. అందుకే ఈ సినిమా మీకు ఓ తమిళ సినిమాలాగా కూడా కనిపిస్తుంది. కానీ ఇది రెండు భాషల్లో తెరకెక్కించిన చిత్రం.
నక్షత్రంతో నిరాశా?
ఆ సినిమా సరైన ఆదరణ పొందకపోవడంతో నిరాశపడిన మాట నిజమే. ఎందుకంటే ఎంతో నమ్మి చేసిన సినిమా అది. జయాపజయాలు పక్కనపెడితే కృష్ణవంశీతో పనిచేయడం చాలా ఆనందమనిపించింది. ఆయనతో ఎప్పటినుంచో చేయాలనుకున్నమాట నక్షత్రంతో కుదిరింది.
తమిళంపైనే ఫోకస్
తమిళంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించే ఆలోచన మాత్రం లేదు. తెలుగులో 16 సినిమాలు చేస్తే, తమిళంలో మూడు సినిమాలే చేశాను. తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ఇమేజ్ వుంది కనుక ఇక్కడే చేస్తా. అప్పుడప్పుడు తమిళ సినిమాలు కూడా చేస్తా. తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకుంటుంటే మనమెందుకు చేయకూడదు అన్న అభిప్రాయం నాది. అనేక అవకాశాలు తమిళంలో వస్తున్నా, అన్నీ ఒప్పుకోవడంలేదు.
టెన్షన్ లేదు
ఈ సినిమాపై చాలా నమ్మకంతో వున్నా. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. సందీప్ కిషన్ మంచి చిత్రం చేశాడన్నమాట ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో పెద్ద టెన్షన్ లేదు.
తర్వాతి చిత్రాలు
ప్రస్తుతం మంజులతో ఓ సినిమా చేస్తున్నా. అది పక్కా ప్యూర్ లవ్‌స్టోరీ. దాంతోపాటు కునాల్ దర్శకత్వంలో మరోటి. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాను. గౌతమ్ మీనన్ బ్యానర్‌లో డి16 అనే సినిమా కూడా చేస్తున్నా.

- శ్రీ