రాష్ట్రీయం

భూములు లాక్కునేందుకే కేబినెట్ భేటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, నవంబర్ 12: రాష్ట్రంలోని పేదల భూములు లాక్కునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తుంటారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ పేదల భూములు ఉన్నాయి, వాటిని ఎలా లాక్కోవాలి, బడాబాబులకు ఎలా పంచిపెట్టాలలన్న విషయాలనే మంత్రివర్గ సమావేశాల్లో ఎక్కువగా చర్చిస్తుంటారన్నారు. ప్రజా సంకల్పయాత్ర 6వ రోజు ఆదివారం కడప జిల్లా దువ్వూరు మండలంలో సాగింది. ఈ సందర్భంగా రాత్రి దువ్వూరులో జరిగిన సభలో జగన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రైతులు, ప్రజలకు మేలు చేయకపోగా వారి భూములు లాక్కోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని జగన్ ఆరోపించారు. ఉల్లి, టమోటా, పసుపు, వేరుశెనగ ఇలా చెప్పుకుంటూపోతే రైతులు పండిస్తున్న పంటలన్నింటికీ సరైన గిట్టుబాటు ధర లభించడం
లేదన్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నలు వ్యయప్రయాసలకోర్చి వాటిని మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు కావడం లేదన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక రోడ్లపై పారబోసి ఆందోళనకు దిగుతున్నారన్నారు. ఇవేవీ ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. దివంగత నేత వైఎస్ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర అందించి రైతన్నలను ఆదుకున్నారని గుర్తుచేశారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులు ఏడాదికి రెండు పంటలు పండించేవారన్నారు. కానీ నేడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఒక్క పంట కూడా పండించలేని స్థితిలో రైతు ఉన్నాడని, దీనికి కారణం ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరు ఉన్నా సీమకు తరలించడం లేదని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండు పంటలకు నీరు విడుదల చేస్తామన్నారు. ధరలు స్థిరీకరించి గిట్టుబాటు అయ్యేటట్టు చేస్తామన్నారు. రుణమాఫీ పేరిట అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్నకు చివరకు నిరాశే మిగిలిందన్నారు.

చిత్రం..దువ్వూరు మండలంలో పాదయాత్ర చేస్తున్న జగన్