సందేశాత్మకంగా భాగ్యనగరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కన్నడంలో విజయవంతమైన రాజధాని చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. యష్, షీలా జంటగా నటించిన ఈ చిత్రానికి కెవి రాజు దర్శకత్వం వహించగా, సంతోష్‌కుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు డ్రింక్స్ వలన పెడదారిపట్టిన నలుగురు యువకుల కథే ఈ సినిమా అని, మాదక ద్రవ్యాలకు యువకులు బానిసలై తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అన్న కథనంతో రూపొందించిన ఈ సినిమాను అందరూ చూడవచ్చని తెలిపారు. మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సందేశాత్మకంగా రూపొందించామని తెలిపారు. హీరో, ప్రకాష్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని, కథా కథనం సరికొత్త ఉంటుందని, సంగీతం ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచిందని ఆయన అన్నారు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నామని తెలిపారు. ముమైత్‌ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య, కెమెరా: హెచ్‌సి వేణు, దర్శకత్వం: కెవి రాజు.