రాష్ట్రీయం

టీటీడీ వాహనంలో చర్చికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 5: కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరుని ఆలనా పాలనా చూసే తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ శాఖలో ఉప కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న స్నేహలత టీటీడీ కేటాయించిన వాహనంలో ప్రార్థనలు చేయడానికి చర్చికి వెళ్లడం వివాదాస్పదమైంది. మంగళవారం ఈస్ట్ చర్చి వద్ద టీటీడీ వాహనం ఏపి 03 టీవి 6240 నెంబర్ కలిగిన వాహనం ఉండటాన్ని కొందరు గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆ వాహనం ఎవరు వాడుతున్నారన్న అంశంపై మీడియా ఆరా తీసింది. టీటీడీ సంక్షేమ శాఖలో డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న హేమలతకు అధికారులు
ఈ వాహనాన్ని కేటాయించినట్లు తేలింది. టీటీడీ సంస్థలో పనిచేస్తూ హైందవులు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో ఒనగూరే నిధులతో వేతనాలు తీసుకుంటూ టీటీడీ వాహనంలోనే చర్చికి వెళ్లడాన్ని సగటు హైందవులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీటీడీలో హైందవులతోపాటు వివిధ మతాలకు చెందిన వారు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు. హైందవేతరులు తిరుమలలో విధులు నిర్వహించే విధానాన్ని టీటీడీ దాదాపు నిషేధించిందనే చెప్పాలి. టీటీడీకి సంబంధించి తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లో హిందువులుగా ఉండి క్రైస్తవ మతాన్ని స్వీకరించి వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు. తిరుపతిలో పనిచేయడానికి టీటీడీ నుంచి ఎలాంటి నిబంధనలు లేవు. టీటీడీ కేటాయించిన హైర్ వాహనాన్ని డిప్యూటీ స్థాయి అధికారి తన స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం ఒక ఎత్తయితే, ఆ వాహనాన్ని చర్చికి తీసుకువెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక ప్రైవేట్ వాహనంలో వెళ్లి ఉన్నా, లేదా తన వాహనానికి ఉంచుకుని ఉన్న టీటీడీ అనే బోర్డును తీసేసినా ఈ విమర్శలు వచ్చేవి కాదు. తననెవరు ప్రశ్నిస్తారులే అనే ధీమాతో ఆమె ఈ వాహనాన్ని తీసుకువెళ్లడానికి సాహసించిందనే వివర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై హిందూ చైతన్య సమితి, తిరుమల తిరుపతి సంరక్షణ సమితిలు మండిపడుతున్నాయి. వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద మంగళవారం ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. టీటీడీలో 1500 మంది అన్యమతస్థులు పనిచేస్తున్నారని, వెంటనే వారిని తొలగించాలన్నారు. వీరికి సహకరిస్తున్న జేఈఓను బదిలీ చేయాలన్నారు.

చిత్రం..తిరుపతి ఈస్ట్ చర్చివద్ద టీటీడీ సంక్షేమశాఖ డిప్యూటీ ఈఓ స్నేహలత వాహనం పార్క్ చేసివున్న దృశ్యం