రాష్ట్రీయం

సంస్కృతి, ఆధునికతల మేళవింపుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: రాజధాని అమరావతిలో పరిపాలనా నగరానికి సంబంధించి డిజైన్లపై హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో ప్రముఖ సినీ దర్శకుడు రాజవౌళి ఆదివారం భేటీ అయ్యారు. రాజధాని నగరానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ బృందం అందచేసిన డిజైన్ల గురించి చర్చించారు. పరిపాలనా నగరం, శాసనసభ భవనాలకు సంబంధించి కొన్ని డిజైన్లను ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునికతల మేళవింపుగా రాజధాని నగరం ఉండాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లకు కొన్ని మార్పులను రాజవౌళి సూచించారు. అనంతరం సీఆర్‌డీఏ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వెంకటపాలెం నుంచి దొండపాడు వరకూ నిర్మిస్తున్న స్పీడ్ యాక్సెస్ రోడ్డు పనులు వచ్చే జనవరి 15నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. రాజధాని పరిధిలో చేపట్టిన 7 ప్రాధాన్య, మరో 3 అదనపు రహదారుల పనుల వేగం పెంచాలని, ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే రాజధానికి తొలిరూపు వస్తుందని ఆయనన్నారు. అమరావతి పరిధిలో చేపట్టనున్న వివిధ గృహ సముదాయాల నిర్మాణాలు పూర్తయ్యేందుకు కూడా గడువు విధించారు. శాసన సభ్యులు, ఐఏఎస్ అధికారులు ఉండే నివాస గృహాల సముదాయాన్ని 2019 ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. నేలపాడు, శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, తదితర ప్రాంతాల్లో 76.5 కిలోమీటర్ల రహదారుల పనులను 2020 నవంబర్ 17లోగా, జోన్-2 పరిధిలోని కొండమరాజుపాలెం, రాయపూడి, తదితర ప్రాంతాల్లోని 64 కిలోమీటర్ల రహదారులను 2010 నవంబర్ 16 నాటికి పూర్తిచేయాలని కూడా చంద్రబాబు సీఆర్‌డీఏను ఆదేశించారు.

చిత్రం..రాజధాని అమరావతి పరిపాలనా నగరి నమూనాలను సీఎం చంద్రబాబుకు వివరిస్తున్న సినీ దర్శకుడు రాజవౌళి