రాష్ట్రీయం

కాల్ చేస్తే.. జేబుకు చిల్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: కాల్ సెంటర్ 1100 తమకు ప్రతిపక్షం వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటారు. కాల్ సెంటర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అందరి అభిమానం చూరగొంది. అయితే ప్రభుత్వ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా కాల్ సెంటర్ 1100ను ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 750 మంది సిబ్బంది 24 గంటలూ ఈ కాల్ సెంటర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సేవల్లో అలసత్వం, అవినీతి వంటివాటిపై సమాచారం తెలుసుకునేందుకు దీన్నో వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ఇది ఉచిత సర్వీస్ అని ప్రచారం జరిగింది. అయితే ఈ కాల్ సెంటర్‌కు కాల్ చేస్తే, వివిధ సెల్యులర్ కంపెనీలు చార్జీ వసూలు చేస్తున్నాయి. టోల్ ఫ్రీ నెంబరు 180-425-4440కు ఉచితంగా ఫోన్ చేయవచ్చు. కానీ ఎక్కువగా 1100 నెంబర్ ప్రచారం కావడంతో ఆ నెంబర్‌కే ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. ఫిర్యాదు స్వీకరణకు ఆధార్ నంబర్, తదితర వివరాలు తీసుకుంటుండటంతో ఎక్కువ సమయం మాట్లాడాల్సి వస్తోంది. అందువల్ల ఈ నెంబర్‌కు ఫోన్ చేసేవారు సెల్‌ఫోన్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, కాల్ సెంటరే తమ ప్రతిపక్షమని, ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ చెబుతుంటారు. ఈవిషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వద్ద ‘ఆంధ్రభూమి’ ప్రస్తావించగా.. 1100 నంబర్‌కు కాల్ చేస్తే చార్జీలు పడుతున్న విషయం తనకు తెలియదని, ఇప్పుడే వింటున్నానని అన్నారు. దీనిపై సెల్యులర్ కంపెనీలతో మాట్లాడతానని మంత్రి చెప్పారు.