ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు, విజయనగరం పీవోలకు షోకాజ్ నోటీస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడి బయటి పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం
సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ ఆగ్రహం

విజయవాడ, డిసెంబర్ 20: సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయం ఆదేశించినా బడి బయటి పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యంపై ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017-18 సంవత్సరానికి గాను అన్ని జిల్లాల్లో బడి బయటి పిల్లలకు రవాణా వసతి కల్పించాలని సర్వశిక్షా అభియాన్ నిర్ణయించింది. ఇందుకోసం ఎస్పీడీ గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం అన్ని జిల్లాల్లో ఎస్‌ఎస్‌ఏ చైర్మన్‌లైన కలెక్టర్ల అనుమతితో ప్రాజెక్టు అధికారులు రవాణా వసతి కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం బడి బయటి విద్యార్థుల రవాణా కోసం నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికే ఆ జిల్లాల సీవోలు నేటికీ చర్యలు చేపట్టలేదు. ఎస్పీడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో సైతం ఈ విషయంపై సూచనలు చేసినా ఫలితం కనిపించలేదు. పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటూ పదే పదే సూచనలు చేసినా బేఖాతరు చేసిన రెండు జిల్లాల ప్రాజెక్టు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ మూడు రోజుల గడువునిస్తూ ఎస్పీడీ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.