ఆంధ్రప్రదేశ్‌

వచ్చే నెల 28న బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 20: కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా నూతన ఫ్రంట్ ఏర్పాటుకు సీపీఎం ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 28వ తేదీన ఈ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఖమ్మం జిల్లాలో ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఏర్పడే ఈ ఫ్రంట్‌లో చేరికపై బిఎస్పీ అధినేత మాయావతి, సీపీఐ, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే వారు ఫ్రంట్‌లో చేరుతారని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను గెలిపించడం, ఓడించడం కాకుండా ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఆవిర్భావ సదస్సుకు సీపీఎం అగ్రనేత ప్రకాశ్‌కారత్, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు ఆయా పార్టీల నేతలంతా హాజరవుతారని తమ్మినేని తెలిపారు. అగ్రకులాలు ఎంపీ, ఎమ్మెల్యేలు కావడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే కుల ఆధిపత్యానికి వ్యతిరేకమని, మతపరమైన విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఈ ఫ్రంట్ ఎన్నికల కోసం కాకుండా ఎన్నికలయిన తరువాత కూడా ప్రజా సమస్యలపై పోరాడేందుకు పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయమంటే ఒక కులానికో, వ్యక్తికో పదవులివ్వడం కాదని, వారికి హక్కులు కల్పించి సాధికారత వైపు నడిపించాలన్నారు. దీనిపై సీపీఎం ముందుంటుందని వెల్లడించారు. వామపక్ష పార్టీలన్ని ఒకే వేదికపైకి రావడంతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నయంగా ఈ ఫ్రంట్‌ను తీర్చిదిద్దుతామన్నారు.