కడప

డ్రాప్ ఔట్స్ సర్వే నివేదిక అందజేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనగలూరు, డిసెంబర్ 21: మండలంలో బడిమానేసి ఇంటి వద్దనే ఉంటున్న విద్యార్థులను గుర్తించి వెంటనే ఎస్‌ఎస్‌ఏ కార్యాలయానికి నివేదించాలని ఐఇడి కో-ఆర్డినేటర్ నాగస్వర్ణలత కోరారు. గురువారం స్థానిక ఎంఇఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మండలంలో డ్రాపౌట్స్ వివరాలు ఇంకా గుర్తించాల్సి గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతుందని, త్వరితగతిన బడి బయట పిల్లల జాబితాను పంపాలన్నారు. ఈ సమావేశంలో ఎంఇఓ శ్రీనివాసులు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ కాకి విజయకుమార్, ఐఇడి టీచర్ వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించండి
రాజంపేట టౌన్, డిసెంబర్ 21:ఎపి విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కడపలో నిర్వహించే ఐక్యవేదిక సదస్సులో కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ డివిజన్ కార్యదర్శి పి.బాలకృష్ణ కోరారు. గురువారం రాజంపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను ఈ ప్రభుత్వం తుంగలోతొక్కి కార్మికులను మోసపూరితంగా దగాచేస్తుందని విమర్శించారు. విజయవాడలో 20 వేల మంది కార్మికులు నిరసన వ్యక్తం చేసినా ఈ ప్రభుత్వంకు చలనంలేకుండా పోయిందన్నారు. విశాఖ హుదూద్ తుఫాన్ సందర్భంగా కార్మికులు ఎంత కష్టపడినా ఈ ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే జనవరి 27 నుండి కార్మికులంతా సమ్మెబాట పట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘ నాయకులు జి.చంద్రారెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రూ. 10 నాణెలను తిరస్కరిస్తున్న వ్యాపారులు
రైల్వేకోడూరు, డిసెంబర్ 21: నియోజకవర్గ కేంద్రమైన రైల్వేకోడూరు పట్టణంతో పాటు గ్రామాలలో సైతం పది రూపాయల నాణెలను తీసుకునేందుకు ఏ వ్యాపారులు కూడా ముందుకు రాక పోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులలో సైతం ఈ నాణెలను అధికారులు తీసుకోవడం లేదంటూ స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినపుడు ఈ నాణెలను వినియోగదారులు ఇచ్చినా వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. టీ కొట్లు మొదలుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే దుకాణాల వరకు, కనీసం బిక్షగాళ్లు కూడా ఈ నాణెలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నాణెలు చెలామణి అయ్యేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.