కడప

ప్రజాసమస్యలను అధికారులు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,డిసెంబర్ 23:గ్రామీణ ప్రాంతాలనుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజాసమస్యలు ఆయాశాఖల అధికారులు ఓపిగ్గా విని వాటి పరిష్కారం కోసం కృషిచేయాలని కలెక్టర్ టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మీకోసం భవనంలో శనివారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మీకోసం జరిగింది. అర్జీల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికే అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లాస్థాయి అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు ఓపిగ్గా విని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. చెన్నూరు మండలం శివాల్‌పల్లె వసంతమ్మ సర్వేనెంబర్ 76/2లో 0.27సెంట్లు ఉన్న తన భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించాలని అభ్యర్థించారు. దువ్వూరు మండల గుడిపాడు రాజమ్మ ఆరోగ్యం సరిగా లేనందున సిఎం రిలీఫ్‌ఫండ్ నుంచి ఆర్థికసాయం కోరారు. కొండాపురం మండలం కొండాపురం మారెప్ప రేషన్‌కార్డు పోగొట్టుకున్నానని కొత్త రేషన్‌కార్డు మంజూరుకోసం విజ్ఞప్తిచేశారు. గోపవరం మండలం కాలువపల్లె మంజుల ఎన్‌టిఆర్ గృహనిర్మాణం కోసం ఇంటిస్థలం మంజూరు చేయాలని కోరింది. కడప మండలం కడప టౌన్ రాజేశ్వరీ ఇంటిస్థలం ఆక్రమణ విషయమై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వరరావు, సర్వేశాఖ సహాయ సంచాలకులు హనుమాన్ ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి లలితభాయి, అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానశేఖర్, కలెక్టర్ ఏవో శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

సుండుపల్లె, డిసెంబర్ 23: సుండుపల్లె శివాలయ ప్రాంగణంలో వేంకటేశ్వరుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం ఉదయం కళ్యాణానికి వందలాది మంది మహిళలు హాజరయ్యారు. ఉదయం నుండి వేంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవిలకు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా వెంకన్న, శ్రీదేవి, భూదేవిలను కల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. డప్పు వాయిద్యాల మధ్య, వేదపండితులు సాంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు సుండుపల్లెతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువతులు, మహిళలు భారీగా హాజరయ్యారు. ఉదయం నుండి శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల నుండి శివాలయాన్ని ముస్తాబు చేశారు. వేంకటేశుని కల్యాణం సుండుపల్లెలో ఒక పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. హాజరైన వందలాది మంది భక్తులకు వినాయకనగర్‌కు చెందిన రమణ, రామకృష్ణ, భూదేవిలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.