రాముడు చేసింది తప్పే అయితే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/27c1_9.jpg?itok=2xkAwAxW)
విలక్షణ నటుడు డా.మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో మోహన్‌బాబు పవర్ఫుల్ లుక్ విశేషంగా ఆకట్టుకోగా, పోస్టర్ ఉన్న కాప్షన్ ‘ఆ రోజు రాముడు చేసింది తప్పే అయితే.. నాదీ తప్పే’ మరింత ఆసక్తిని రేపుతోంది. మోహన్‌బాబు తన మైలురాయి చిత్రాలైన పెదరాయుడు మరియు రాయలసీమ రామన్న చౌదరి తరహాలో మరో శక్తివంతమైన పాత్రలో కనుపించబోతున్నారని తెలుస్తోంది. విష్ణు మంచు కూడా మరో పవర్ఫుల్ పాత్రలో నటించడం విశేషం. విష్ణుకు జోడీగా శ్రీయ కనిపించనున్నారు. నిఖిలా విమల్ మోహన్‌బాబు కూతురుగా టైటిల్ పాత్రలో నటించగా ఇతర ముఖ్యపాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 9న విడుదల తేదీగా ఖరారు చేసిన గాయత్రి చిత్రాన్ని మోహన్‌బాబు తమ ప్రతిష్ఠాత్మక శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, చాయాగ్రహణం:సర్వేశ్ మురారి, ఆర్ట్:చిన్న, ఎడిటర్:ఎం.ఆర్.వర్మ, నిర్మాత:డా మోహన్‌బాబు.ఎం., దర్శకత్వం:మదన్ రామిగాని.