రాష్ట్రీయం

భోగాపురంలో విమానాల నిర్వహణ కేంద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 26: జిల్లాలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కార్గోతోపాటు విమానాల నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. మంగళవారం ఆయన నెల్లిమర్లలోని జగ్గుపేటలో రూ.23.81కోట్లతో నిర్మించనున్న మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దుబాయ్, సింగపూర్, శ్రీలంక దేశాలలో మాత్ర మే విమానాల మరమ్మతు, నిర్వహణ సదుపాయాలు ఉన్నాయన్నారు.
ఈ కేంద్రాలను నిర్వహించడం వల్ల ఆయా దేశాలకు ఏటా రూ.715 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోందన్నారు.