డైలీ సీరియల్

వ్యూహం-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్యోన్యంగా వుండే మమ్మల్ని విడదీయాలని దుర్బుద్ధి పుట్టింది అరవింద్‌కు. ‘తన వైవాహిక జీవితం అతలాకుతలం అయ్యింది కాబట్టి మిత్రుడికి అదే గతి పట్టాలి’- అదీ అతని ఆలోచన.. అతని ప్రవర్తన పసిగట్టలేకపోయాను.. మా ఇంటికి వచ్చినపుడల్లా కాస్ట్లీ ప్రెజెంటేషన్స్ తెచ్చి ఇచ్చేవాడు. నేను ఎరుగా వున్నప్పుడు ‘‘మీ ఆయన ఏడు జన్మలు ఎత్తినా ఇటువంటి ఆర్టికల్స్ కొనలేడు’’ అనేవాడు మా ఆవిడతో. ఫ్లయిట్‌లో తీసుకెళ్లి కాశ్మీర్, సిమ్లా, నేపాల్ చూపించేడు. పబ్‌లు చుట్టూ తిప్పేవాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అనుకుంది మా ఆవిడ. పబ్‌లో పరిచయమైన ఓ ఇండస్ట్రియలిస్ట్‌తో అనుబంధం పెంచుకుంది. నాకు విడాకులు ఇచ్చేసింది. తాగుడు అలవాటయ్యింది. మా ఆవిడ నాకు ద్రోహం చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు.. ఆఫీసుకు వెళ్ళం మానేశాను.. ఉద్యోగం పోయింది.
ఖర్చులకోసం పూర్తిగా అరవింద్‌మీద ఆధారపడ్డాను. అదే అతనికి కావాల్సింది.. నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు. ఊబిలో ఇరుక్కుపోయాను.. బయటపడడం కష్టం!
‘‘అదేమిటి ఊబి అంటున్నారేమిటి? ఇక్కడంతా పారడైజ్‌లా కన్పిస్తూంది.. అన్ని సౌకర్యాలు వున్నాయి.. జీతం కూడా బాగానే ఇస్తున్నారు’’ అడిగిందామె.
కాశీకి ఎన్నో రహస్యలు తెలుసు.. అవన్నీ చెబితే ఆమె బెదిరిపోయి డాక్టర్ ఉద్యోగం వొదిలేసి పారిపోతుంది..
ఆ అమ్మాయి తన కళ్ళముందే ఉండాలి!
తనకంటే ఇరవైయ్యేళ్ళు చిన్నది.
.. మంచులో తడిసిన మల్లెపువ్వులా తనకు కనువిందు చేస్తూవుంది. అందాల జాబిలి ఇలపైకివచ్చి తన ఎదుట నిలిచినట్లుగా వుంది.
ఆమెను బెదరగొట్టి తనెందుకు ఆమెతో సాన్నిహిత్యం దూరం చేసుకుంటాడు!
‘‘మా శ్రీమతితో కలిసి ఆనందసీమలో విహరించేవాడిని.. సంసారం విచ్ఛిన్నం చేసుకుని ఇక్కడకు వచ్చి పడ్డాను. నాకు ఈ ప్రాంతం ఊబిలాగే కన్పిస్తుంది.’’ అన్నాడతను.
హాస్పిటల్ నుంచి క్వార్టర్స్‌కు కారులో వెళ్తున్న డాక్టర్ అరవింద్, తన మిత్రుడు డాక్టర్ లోహితతో ఆమె క్వార్టర్ ముందు కూర్చుని ముచ్చటలాడటం గమనించాడు.
చిరాకు వచ్చేసింది.
కారు ఆపి కాశిని పిలిచాడు.
‘‘ఇక్కడేం చేస్తున్నావ్.. హెచ్‌ఆర్ వింగ్‌లో పని వదిలేసి ఇక్కడ ముచ్చట్లు చెబుతున్నావా? కారు ఎక్కు, నీతో మాట్లాడాలి!’’ అన్నాడు డాక్టర్ అరవింద్.
‘‘కారు కొంచెం ముందుకు వెళ్ళేక మనం బాల్య స్నేహితులమని ఆ అమ్మాయికి చెప్పకు! ఆ అమ్మాయి చాలా ఇంటలిజెంట్! ఆమె సర్వీసెస్ మన హాస్పిటల్‌కు కావాలి!’’
డాక్టర్ అరవింద్ వైపు తిరిగి ‘‘నేనెందుకు చెబుతాను’’ అన్నాడు కాశి.
ఉదయం పూట రెండు గంటలు ఒపి డ్యూటీ ఉంటుంది లోహితకు.
ఔట్ పేషెంట్లను చూసేక వార్డులోకి వెళ్లి ఆడ పేషెంట్లను చూస్తూ వుంటుంది. ఆపరేషన్ థియేటర్‌ల్లో డ్యూటీకి ఒక సమయం అంటూ వుండదు. పగలు, రాత్రి అటెండ్ అవుతూనే వుండాలి.
రాత్రి పూట నర్సు కాల్ చేసింది. ఆడ పేషెంట్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఆమెకు కార్సినోమా థైరాయిడ్ ఆపరేషన్ రెండు రోజుల క్రితం జరిగింది. డాక్టర్ వౌర్య ఆ ఆపరేషన్ చేశాడు. రెండ్రోజులు సెలవు పెట్టి ఆయన స్వగ్రామం వెళ్ళాడు.
.. వెంటనే రోగికి స్వస్థత చేకూర్చాలి. ఊపిరి పీల్చుకునేలా చేయాలి. అదో ఛాలెంజ్! ఎమర్జెన్సీ థియేటర్ స్ట్ఫాను అలెర్ట్ చేసింది. ఆ రోగికి ‘ట్రాకియోస్టమి’ ఆపరేషన్ చేసింది. గొంతు దగ్గర చేసే ఆపరేషన్.. చాలా జాగ్రత్తగా చేయాలి! ఏ మాత్రం పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకు ముప్పు..
‘ట్రాకియోస్టమి’ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. రోగికి రిలీఫ్ వచ్చింది. మరుసటి రోజు పూర్తిగా తేరుకుంది ఆ పేషెంటు.
లోహిత రూముకు వచ్చాడు డాక్టర్ వౌర్య.
‘‘మొన్న నా వార్డులోని ఆడ పేషెంటుకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడేరట.. చాలా థాంక్స్! సమయస్ఫూర్తిగా వెంటనే డెసిషన్ తీసుకుని ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. రియల్లీ గుడ్ జాబ్! ఇన్ని తెలివితేటలు వున్న మీరు ఇక్కడ పనిచేయకూడదు.. నా మాట విని ఇక్కడ జాబ్ మానుకుని మరో హాస్పిటల్లో జాయిన్ కండి.. మాఫియా గ్యాంగ్‌లదే రాజ్యం ఇక్కడ’’ అన్నాడాయన.
ఆయన చెప్పే మాటలు అర్థంగాక అయోమయంగా ఆయనవైపు చూసింది లోహిత.
‘‘ఇంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పలేను. ప్లీజ్ లీవ్ దిస్ హాస్పిటల్ ఎట్‌వన్స్’’ అనేసి ఆ రూములోనుంచి వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు డాక్టర్ వౌర్య.
***
రాత్రి ఎనిమిదవుతూ వుంది.
కాటేజ్‌లో కూర్చుని మెడికల్ మాగజైన్ పేజీలు తిరగేస్తున్నాడ. మాగజైన్‌లోని ఆర్టికల్ నాలుగుసార్లు చదివాడు. ఆ ఆర్టికల్‌లోని కంటెంట్ మెదడు పొరల్లోకి దూరడంలేదు.
వౌర్య మాగజైన్ టేబుల్ మీద పడేసి కాటేజీ వెనుక వైపున్న స్విమ్మింగ్ పూల్ వైపు నడిచాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఎవరూ లేరు.. ర్యాక్‌లోనుంచి స్విమ్మింగ్ డ్రెస్ బయటకు తీసి డ్రెస్ మార్చుకున్నాడు.
నీళ్ళలోకి దూకేడు.
చల్లటి నీళ్ళలో ఈతకొట్టేసరికి శరీరం తేలికపడింది.
మనసు ఉల్లాసంగా వుంది. సిమ్మింగ్ పూల్ అంచులో వున్న స్టీల్ బార్ పట్టుకుని నీళ్ళలో నిలబడ్డాడు.
మరో పది నిముషాలు నీళ్ళలో ఈత కొట్టాలనిపించింది. నీళ్ళ అడుగు భాగనికి డైవింగ్ చేశాడు వౌర్య.
నీళ్ళలో మరో వ్యక్తి వున్నాడు. వౌర్య జుట్టు పట్టుకుని పైకి లేవనివ్వలేదు. విదిలించుకోబోయాడు.
అతని బలిష్టమైన చేతులు వౌర్య తలను అదిమిపెట్టాయి.
శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అయింది. నీళ్ళు గొంతులో, ముక్కులో చొరబడ్డాయి.
వౌర్య శవం నీళ్లపై తేలియాడింది మరికొన్ని నిముషాలకు..
*** ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876