ఆంధ్రప్రదేశ్‌

ఆర్డీఎస్ రైతుకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆయకట్టు రైతులకు శుభవార్త. ఆర్డీఎస్ ఆయకట్టుకు తుంగభద్ర డ్యామ్‌నుంచి నీటి విడుదలకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆర్డీఎస్‌కు తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఇండెంట్ సమర్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండెంట్ సమర్పించకపోవడంతో తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావుతో బుధవారం తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఫోన్లో చర్చించారు. తుంగభద్ర డ్యామ్ నుంచి కెసి కెనాల్‌కు అవసరమైన నీటి విడుదల కోసం వెంటనే ఇండెంట్ ఇవ్వడానికి మంత్రి దేవినేని ఉమ అంగీకరించారు. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి ఇండెంట్ అందగానే నీటి విడుదలకు తుంగభద్ర బోర్డు సిద్థంగా ఉన్నట్టు అక్కడి అధికారులు స్పష్టం చేసారు. తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి వదిలితే కెసి కెనాల్ ద్వారా ఆర్డీఎస్‌లోకి చేరుకుంటాయి. తద్వారా కెసి కెనాల్, ఆర్డీఎస్ రెండింటి పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తుంగభద్ర డ్యామ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 5.2 టిఎంసిలు, తెలంగాణకు 3.5 టిఎంసిల నీటి వాటా రావాల్సి ఉంది. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ కార్యదర్శి శశిభూషన్‌తో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఫోన్లో మాట్లాడగా గురువారం ఇండెంట్ పంపించనున్నట్టు తెలిపినట్టు సమాచారం.